చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కృష్ణాపురంలో పాత కక్షలు వేడెక్కుతున్నాయి. స్థానిక తెదేపా నేత, తిరుపతి పురపాలక సంఘం మాజీ డైరెక్టర్ రామస్వామి ఇంటిపై అదే గ్రామానికి చెందిన వైకాపాకు చెందిన సర్పంచ్ ముద్దు రాయల్ కుటుంబ సభ్యులు అర్ధ రాత్రి రాళ్లతో దాడికి పాల్పడ్డారు.
బాధితులకు రుయాలో చికిత్స..
ఘటనలో తెలుగుదేశం పార్టీకి చెందిన కుమార్, పార్వతమ్మ గాయపడగా తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెదేపా తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జి నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : 'పూనావాలాకు జడ్ ప్లస్ భద్రత కల్పించండి'