ETV Bharat / crime

రుణ యాప్‌ ఆగడాలకు యువకుడి బలి.. కుటుంబసభ్యులకూ తప్పని వేధింపులు

LOAN APPS: సెల్‌ఫోన్‌లో చూసి చదువు కోసమని ఓ లోన్‌యాప్‌లో కొంత రుణం తీసుకున్నాడో యువకుడు. అయితే తిరిగి డబ్బులు చెల్లించాలని యాప్‌ నిర్వాహకులు అతడిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. నగ్నంగా ఉన్న వేరే చిత్రానికి అతని తల అతికించి వాటిని ఇతరుల వాట్సప్‌ నంబర్లకు పంపించారు. తీవ్ర మానసిక క్షోభకు గురైన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతను మరణించిన తర్వాత కూడా అతని సెల్‌ఫోన్‌కు ఇంకా మెసేజ్‌లు పంపడంతో ఆత్మహత్యకు గల కారణం బయటపడింది.

LOAN APPS
రుణయాప్‌ ఆగడాలకు యువకుడి బలి
author img

By

Published : Jun 28, 2022, 7:48 AM IST

LOAN APPS: రుణ యాప్‌ సంస్థల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వారి ఆగడాలు భరించలేక ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషయం తెలియని యాప్​ నిర్వాహకులు.. అతని సెల్​ఫోన్​కు మెసెజ్​లు పంపుతూనే ఉన్నారు. దీంతో ఆ యువకుడి ఆత్మహత్యకు గల కారణమేంటో బయటపడింది.

పోలీసులు, బాధితుల కథనం మేరకు.. తూర్పుగోదావరి జిల్లా కడియం మండల కేంద్రానికి చెందిన కోనా సతీశ్‌(28) పీజీ చదివాడు. స్వతహాగా మృదుస్వభావి. తండ్రి పూలవ్యాపారి కాగా, తల్లి గృహిణి. సెల్‌ఫోన్‌లో చూసి చదువుల కోసమని ఓ లోన్‌యాప్‌లో కొంత రుణం తీసుకున్నాడు. తిరిగి చెల్లించాలంటూ యాప్‌ నిర్వాహకులు అతడిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. నగ్నంగా ఉన్న వేరే చిత్రానికి సతీశ్‌ తల అతికించి వాటిని ఇతరుల వాట్సప్‌ నంబర్లకు పంపించారు. ఆ విషయం తెలిసి సతీశ్‌ తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. ఈ నెల 24న సినిమాకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకెళ్లి, అదేరోజు రాత్రి భీమవరం సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం మరునాడు కుటుంబసభ్యులకు తెలిసింది. మరోవైపు అప్పు చెల్లించాలంటూ సతీశ్‌ కుటుంబసభ్యులకు ఈ నెల 26 నుంచి సెల్‌ఫోన్‌ సందేశాలు వస్తూనే ఉన్నాయి. మార్ఫింగ్‌ చేసిన సతీశ్‌ నగ్నచిత్రాలు సైతం పంపిస్తున్నారు. అప్పు కట్టకుంటే కుటుంబసభ్యుల ఫొటోలు కూడా అందరికీ పంపిస్తామని బెదిరిస్తున్నారు. దీంతో బాధిత కుటుంబం కడియం పోలీసులను ఆశ్రయించింది. దీనిపై ఫిర్యాదు అందిందని, దర్యాప్తు చేస్తామని కడియం సీఐ రాంబాబు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.