ETV Bharat / crime

"నా చావుకు ఎవరూ కారణం కాదు".. అప్పులు తీర్చలేక యువకుడు ఆత్మహత్య

Young Man Suicide : ఆ యువకుడు చిన్న ఉద్యోగం చేసుకుంటూ.. జల్సాలకు అలవాటు పడ్డాడు. వచ్చే జీతం దేనికి సరిపోకపోవడంతో తెలిసిన వారి దగ్గర అప్పు చేయడం మొదలు పట్టాడు. అదీ సరిపోక ఆన్​లైన్​లో రుణం తీసుకున్నాడు. ఇక అప్పటి నుంచి అతనికి వేధింపులు మొదలైయ్యాయి. తీసుకున్న డబ్బులు చెల్లించాలని ఒత్తిడి పెడుతుండడంతో ఎవరికీ చెప్పుకోలేక చివరికి ఊపిరి తీసుకున్నాడు. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ లేఖ రాసి మరీ చనిపోయాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.

Young Man Suicide
Young Man Suicide
author img

By

Published : Jan 4, 2023, 2:10 PM IST

Young Man Suicide : వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికి అందినంత వరకు అప్పులు చేసిన యువకుడు వాటితో పాటు ఆన్​లైన్​లో సైతం అప్పు చేశాడు. ఇంకేముంది అన్​లైన్​లో పొందిన అప్పులు తీర్చమంటూ వేధింపులు మొదలయ్యాయి. ఆదుకోవడానికి ఎవరూ లేక దిక్కుతోచని స్థితిలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు ఎవరూ కారణం కాదంటు.. తన అలవాట్లే తనకు శాపంలా మారాయని వివరిస్తూ సదరు యువకుడు లేఖను రాసిపెట్టి తనువు చాలించిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.

Young Man Suicide
జానకిరామ్​ సూసైడ్​ నోట్​

జిల్లాలోని పెనుమూరు మండలంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన జానకిరామ్ (30) ప్రైవేట్ పనులు చేసుకుంటూ తల్లి, అన్న, వదినలతో కలిసి జీవిస్తున్నాడు. వ్యక్తిగత అవసరాలు, జల్సాల కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలిసిన వారి దగ్గర అప్పు చేశాడు. అవీ చాలకపోవడంతో లోన్​యాప్​ ద్వారా 80వేల రూపాయలను అప్పుగా తీసుకుని అవసరాలు తీర్చుకున్నాడు. తీసుకున్న అప్పు సకాలంలో చెల్లించలేక పోయాడు. ఆన్​లైన్​ ద్వారా రుణం ఇచ్చిన వారు తిరిగి చెల్లించాలంటూ నిరంతరాయంగా వేధించడంతో మానసిక కుంగుబాటుకు లోనై ముభావంగా ఉండేవాడు.

ప్రైవేటు ఉద్యోగిగా అంతంత మాత్రమే ఆదాయం పొందడం, చేసిన అప్పులు తీర్చే దారి లేకపోవడంతో కుటుంబ సభ్యులు తనని క్షమించాలని కోరుతూ, తన చావుకు ఎవరూ బాధ్యులు కారని, ఎవరిని నిందించవద్దని సూచిస్తూ లేఖ రాసిపెట్టి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి మరణంతో అంబేద్కర్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతడి ఆత్మహత్యపై రాత్రి 10.30 గంటల వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై అనిల్‌కుమార్‌ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.