ETV Bharat / crime

తిరుపతి జిల్లాలో దారుణం.. యువకుడిని గొంతు కోసి చంపిన దుండగులు

author img

By

Published : Jan 1, 2023, 12:36 PM IST

Young Man Murder : తిరుపతి జిల్లాలో యువకుడ్ని దుండగులు కత్తిలో పొడిచి గొంతుకోసి హత్య చేశారు. అందరూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుండగా.. నిందితులు మాత్రం పథకం ప్రకారం మృతుడ్ని హత్య చేశారు. విద్యుత్​ తొలగించి మరీ ఇంట్లొకి చొరబడి దారుణంగా హత్య చేశారు.

naidupeta young man murder
నాయుడి పేట యువకుడి హత్య

Young Man Murder : తిరుపతి జిల్లా నాయుడుపేటలో కొత్త ఏడాది వేడుకల్లో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని స్థానికులు భావిస్తున్నారు. నాయుడుపేటలోని పొగొట్టం కాలనీలో నివాసం ఉంటున్న వెంకీ అనే యువకుడ్ని కొందరు వ్యక్తులు శనివారం అర్ధరాత్రి గొంతు కోసి హత్య చేసి ఉంటారని స్థానికులంటున్నారు. పథకం ప్రకారమే విద్యుత్​ తొలగించి.. అతని ఇంట్లోకి చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారంటున్నారు. ఘటనాస్థలంలోనే వెంకీ ప్రాణాలు విడవగా.. మృతుడి సోదరుడికి గాయలయ్యాయి. హత్యలో పాల్గొన్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నూతన సంవత్సర వేళ యువకుడి మరణంతో మృతుని ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.