ACCIDENT: ఓ ద్విచక్ర వాహనదారుడు రోడ్డుపై గోతిలో పడి మరణించాడు. ఈ ఘటన బుధవారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం ముదునూరులోని రావికుంట వద్ద చోటుచేసుకుంది. అత్తిలికి చెందిన కొండే వెంకట్రావు పెద్ద కుమారుడు ప్రవీణ్‌కుమార్ (29) దక్షిణాఫ్రికాలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. 4నెలల కిందట స్వగ్రామానికి వచ్చారు. మరో వారం రోజుల్లో తిరిగి వెళ్లాల్సి ఉంది. బుధవారం రాత్రి బైక్‌పై అత్తిలి నుంచి తాడేపల్లిగూడెం బయలుదేరారు. రావిగుంట వద్ద రోడ్డుపై గోతులు కనిపించక అదుపుతప్పి, ద్విచక్రవాహనంపై నుంచి ఎగిరి పడటంతో తలకు బలమైన గాయాలై... అక్కడికక్కడే మృతిచెందాడు. పెంటపాడు నుంచి పిప్పర వరకు ఉన్న ఈ దారిని గతేడాది ఆర్‌అండ్‌బీ అధికారులు నాలుగు లేన్ల రహదారిగా ఆధునికీకరించారు. మూడు నెలల కిందటే గోతులు పూడ్చారు. వర్షాలకు మళ్లీ గోతులు పడి భారీ వాహనాల రాకపోకలతో ప్రమాదకరంగా మారింది.
ఇవీ చదవండి: