ETV Bharat / crime

బిడ్డకు జన్మనిచ్చిన.. "పదో తరగతి" బాలిక! - chittoor crime news

Student Delivery: ఆ బాలిక చదివేది పదో తరగతి.. కానీ ఓ యువకుడి బెదిరింపులకు భయపడి లైంగిక దాడిని ఎదుర్కొంది. ఎవరికైన చెపితే వీడియోలు బయటపెడతానని ఆ బాలికను బయపెట్టాడు. దాంతో ఎవరికీ చెప్పకుండా లోలోపలే మగ్గిపోయింది. చివరకు గర్భం దాల్చి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ అమానుష ఘటన చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలంలో జరిగింది.

X student delivery
మగబిడ్డకు జన్మనిచ్చిన "పదో తరగతి" బాలిక
author img

By

Published : Mar 25, 2022, 11:02 AM IST

Student Delivery: యువకుడి బెదిరింపులకు భయపడి పలుమార్లు లైంగిక దాడిని ఎదుర్కొన్న ఓ బాలిక చివరకు గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలంలో జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..

అసలేం జరిగిందంటే? : బాధితురాలైన బాలిక మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటూ అక్కడికి 2 కి.మీ దూరంలోని బంధువుల ఇంట్లో ఉంటోంది. ఓసారి ఇంటికి విద్యుత్ మరమ్మతు చేయడానికి వచ్చిన పీలేరు మండలం ఎర్రగుంట్లపల్లెకు చెందిన రాజేశ్‌ (34) బాలికపై కన్నేశాడు. అప్పటికే అతడు ఇద్దరు బిడ్డల తండ్రి. బాలిక కదలికలను గమనించి ఓ రోజు వెంటపడి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ సమయంలో సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. ఎవరికైనా చెబితే వీడియో వైరల్‌ చేస్తానని బెదిరించి పలుమార్లు లొంగదీసుకున్నాడు.

ఈ విషయం ఇంట్లో చెబితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని భయపడిన బాలిక ఎవరికీ చెప్పలేదు. కడుపులో ఏం జరుగుతుందో తెలియక నెలలపాటు ఇబ్బంది పడింది. కడుపునొప్పి తీవ్రం కావడంతో 10 రోజులుగా పాఠశాలకు వెళ్లడం లేదు. తల్లిదండ్రులు రొంపిచెర్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా గర్భం దాల్చిన సంగతి బయటపడింది. గురువారం మగబిడ్డకు జన్మనిచ్చింది అని బాలిక బంధువులు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితుణ్ని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని రొంపిచెర్ల ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. నవజాత శిశువు ఆరోగ్యం సాధారణంగా ఉందని చెప్పారు.

ఇదీ చదవండి: Lokesh on RRR: ఆర్​ఆర్​ఆర్​పై లోకేశ్​ ట్వీట్​.. ఏమన్నారంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.