ఓ వ్యక్తిపై ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోలేదని మనస్తాపానికి గురైన ఓ మహిళ నగరపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంటి ముందు కారు పెట్టవద్దని చెప్పినందుకు ఇలియాజ్ అనే వ్యక్తి.. గోడ రాళ్లు పడేసి దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని గుంటూరులో మహిళ బాధితురాలు వాపోయింది. దీనిపై నగరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. ఎస్పీ కార్యాలయానికి వెళ్లగా.. తిరిగి నగరపాలెం పోలీసుల వద్దకు పంపారని బాధితురాలు తెలిపింది.
పోలీసులు పట్టించుకోకుండా అతని వైపే మాట్లాడుతున్నారని బాధితురాలు పేర్కొంది. ఇలియాజ్ తనకి వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలుసని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరగడంలేదని మనస్తాపానికి గురై స్టేషన్ ఎదుట నిద్రమాత్రలు మింగింది. స్థానికులు సకాలంలో స్పందించి తనను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించినట్లు చెప్పింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన పోలీసులు స్పదించలేదన్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పదించి తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరింది.
ఇదీ చదవండి: