VIRAL VIDEO మద్యం మత్తులో ఓ మహిళ నడిరోడ్డుపై వీరంగం సృష్టించిన ఘటన ఆదివారం రాత్రి పాతబస్తీ కొత్తపేట నెహ్రూబొమ్మ కూడలిలో చోటు చేసుకుంది. స్థానిక కొండ ప్రాంతంలో నివసించే వ్యక్తి, అతని కుమార్తె(30)కు మద్యం తాగే అలవాటుంది. తండ్రి రెండు, మూడు రోజులుగా మత్తులోనే ఉండి, రోడ్డు పైనే నిద్రిస్తున్నాడు. ఆమె కూడా తాగి ఇంట్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో తండ్రిని ఇంటికి రమ్మని అడగటానికి వచ్చింది. ఈ సందర్భంగా ఇద్దరికి గొడవ జరిగింది. దీంతో ఆమె తండ్రితో పాటు, సర్దిచెప్పబోయిన బంధువులను కొట్టడానికి యత్నించింది. మరోవైపు ఆ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న పలువురిపై కూడా ఆమె దురుసుగా ప్రవర్తించింది. ఓ కారును నిలిపి దాడికి యత్నించింది. రెండో పట్టణ పోలీసులు రంగ ప్రవేశం చేసి తండ్రీకుమార్తెలను పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆ మహిళకు వివాహమైందని, ఇద్దరు పిల్లలున్నారని, భర్తతో విడిపోయిందని సమాచారం. తండ్రీకుమార్తెలకు కౌన్సెలింగ్ ఇచ్చామని, ఘటనపై న్యూసెన్స్ కేసును నమోదు చేశామని రెండో పట్టణ పోలీసు స్టేషన్ సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.
ఇవీ చదవండి: