ETV Bharat / crime

CYBER CRIME: ఆర్థిక సాయం చేస్తామని.. సోనూసూద్‌ పేరుతో ఆన్‌లైన్‌ మోసం - ap crime news

CYBER CRIME: సోనూసూద్​ పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే కరోనా కాలంలో ఎంతో మందికి సహాయం చేశాడు. ఆయన సహాయం పొందిన వారు అతడిని దేవుడితో పోలుస్తారు. ఇదే అదునుగా భావించిన కొత్త రకం మోసానికి పాల్పడ్డారు సైబర్​ నేరగాళ్లు. తాజాగా ఓ మహిళ తన కొడుకు ఆరోగ్యం బాగాలేదని.. ఎవరైనా సాయం చేయాలంటూ సోషల్​ మీడియాలో పోస్టు చేసింది. ఇది చూసిన సైబర్​ నేరగాళ్లు... ఆయన కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామంటూ నమ్మబలికి 95వేల రూపాయలు గుంజాడు. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఇది చదవండి..

CYBER CRIME
CYBER CRIME
author img

By

Published : Jul 1, 2022, 12:54 PM IST

CYBER CRIME: ఆ తల్లి ఎన్నో కష్టాలు పడుతోంది.. దీర్ఘకాలికి వ్యాధితో బాధపడుతున్న తన కుమారుడికి వైద్యం కోసం ఆన్​లైన్​లో దాతల నుంచి సాయం కోరింది. ఇది గమనించిన సైబర్​ నేరగాళ్లు ఆమెకు ఫోన్​ చేశారు. సోనూసూద్​ కార్యాలయం నుంచి ఫోన్​ చేస్తున్నాం.. సాయం చేస్తామంటే.. ఎనీ డెస్క్​ యాప్​లో తన బ్యాంక్​ వివరాలన్నీ నమోదు చేసింది. అంతే అసలే కష్టాల్లో ఉన్న ఆమె బ్యాంకులో నుంచి విడతలవారీగా డబ్బు మాయం చేశారు మోసగాళ్లు.

సినీనటుడు సోనూసూద్‌ పేరుతో ఓ మహిళ బ్యాంకు ఖాతాలోని నగదును ఆన్‌లైన్‌లో చోరీ చేసిన ఘటనపై రాజమహేంద్రవరం మూడో పట్టణ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీఐ మధుబాబు వివరాల మేరకు.. నగరంలోని సీటీఆర్‌ఐ భాస్కరనగర్‌ ప్రాంతానికి చెందిన డి. సత్యశ్రీకి ఆరు నెలల బాబు ఉన్నాడు. చిన్నారికి దీర్ఘకాలిక వ్యాధి సోకడంతో చికిత్స నిమిత్తం రూ.లక్షలు ఖర్చుచేయాల్సిన పరిస్థితి. అంత ఆర్థిక స్థోమత లేని ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా విషయాన్ని స్నేహితులు, బంధువులకు చేరవేశారు. జూన్‌ 27న సత్యశ్రీకి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి, సోనూసూద్‌ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని, ఆర్థికసాయం చేస్తామని నమ్మబలికాడు. వెంటనే ఆమె బ్యాంకు ఖాతా వివరాలు తెలియజేస్తుండగా.. అవేమీ తమకు అక్కర్లేదని, ఫోనులో ఎనీ డెస్కు యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసి వివరాలు నమోదు చేయాలని సూచించాడు. ఆమె పూర్తి వివరాలు యాప్‌లో నమోదు చేశారు. తర్వాత ఆమెకు నగదు రాకపోగా.. పలు దఫాలుగా సత్యశ్రీ బ్యాంకు ఖాతా నుంచి రూ.95 వేలు మాయమయ్యాయి. విషయం గుర్తించిన ఆమె గురువారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.