ETV Bharat / crime

ఆ పోలీస్‌ అధికారి తీరే వేరు!.. ఎందుకో చూస్తే విస్తుపోవాల్సిందే..!

HARRASSMENT: ఆయన ఓ డీఎస్పీ స్థాయి అధికారి. ఆయన మిత్రుడు వేరే జిల్లాలో అగ్నిమాపక శాఖలో అధికారిగా పనిచేస్తుంటారు. గత కొంతకాలంగా ఆ మిత్రుడితో సహజీవనం చేస్తున్న మహిళ అతని తీరు నచ్చక విడిచిపెట్టి జిల్లాకు వచ్చేశారు. ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. తన మిత్రుడు మంచివాడని, అతనితో యథావిధిగా కలిసి ఉండాలంటూ పోలీసు అధికారి ఆమెను బెదిరిస్తున్నారు. ప్రైవేట్‌ వ్యక్తులను ఆమె నివాసానికి పంపి వేధింపులకు దిగుతున్నారు.

HARRASSMENT
HARRASSMENT
author img

By

Published : Jul 26, 2022, 8:22 AM IST

HARRASSMENT: గత కొంతకాలంగా ఒక వ్యక్తితో సహజీవనం చేస్తున్న మహిళ.. అతని తీరు నచ్చక విడిచిపెట్టి వచ్చారు. అయితే ఆ వ్యక్తితో కలిసి సహజీవనం చేయాలని ఓ డీఎస్పీ తనను వేధిస్తున్నారని సోమవారం ఒంగోలులో జరిగిన స్పందనలో ఓ మహిళ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సదరు డీఎస్పీతో పాటు తాను సహజీవనం చేసిన అగ్నిమాపక అధికారిపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. తనతో కలిసి ఉన్న వ్యక్తి బ్యాంకు ఖాతాలు తెరిపించాడని, వాటి లావాదేవీలు, ఏటీఎం కార్డులు, చెక్‌ పుస్తకాలు ఆయన వద్దే ఉన్నాయని పేర్కొన్నారు. ఆ ఇద్దరు అధికారుల బారి నుంచి తనను కాపాడాలని ఆమె అభ్యర్థించారు. పోలీసు శాఖ కేటాయించిన అధికారిక నంబరుతోనే తనను బెదిరిస్తున్నారని ఆ మహిళ పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా ఆ పోలీసు అధికారి వ్యవహారశైలిపై కొందరు లిఖిత పూర్వక ఫిర్యాదులను ఉన్నతాధికారులకు అందజేసినట్లు సమాచారం. పలు చోట్ల భూ వివాదాల్లో తలదూర్చి తన పలుకుబడితో బెదిరిస్తున్నారని.. పోలీస్‌ స్టేషన్లలో తప్పుడు కేసులు పెట్టించి తమ వారి పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారనే అభియోగాలున్నాయి. చివరకు ఔషధ దుకాణాలను సైతం వసూళ్లకు లక్ష్యంగా ఎంచుకున్నారన్న ఆరోపణలు సరేసరి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.