హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ముగ్గురు మహిళల నుంచి 1 లక్ష 80 వేల రూపాయలు వసూలు చేసిన మహిళపై విజయవాడలోని గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పాయకాపురంలోని ప్రకాశ్ నగర్‌కు చెందిన సరోజిని భర్త మరణించడంతో.. ఇద్దరు పిల్లలతో కలిసి గవర్నర్‌పేటలోని పెద్దిబొట్లవారివీధిలో టైలరింగ్ దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.
తన వద్దకు వచ్చే కస్టమర్లతో మాట కలిపి.. తనకు హైకోర్టులో జడ్జి తెలుసని మాయమాటలు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికించింది. రూ.60 వేలు కడితే ఉద్యోగం వస్తుందని నమ్మకంగా చెప్పగా.. గత సంవత్సరం సెప్టెంబరులో డబ్బులు కట్టారు. ఎన్నిసార్లు ఉద్యోగం గురించి అడిగినా దాటవేస్తూ వచ్చింది. పైగా డబ్బులు తిరిగి ఇవ్వకపోగా.. ఉద్యోగాలంటూ ఇబ్బంది పెడితే చంపిస్తానని స్వర్ణకుమారి బెదిరిస్తోందని బాధితులు వాపోయారు. మోసపోయామని గమనించి చివరికి పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. స్వర్ణకుమారిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారు.
ఇదీ చదవండి: