ETV Bharat / crime

Harassment: 'నేను పోలీసు.. నీవు ఒంటరిదానివి'.. అదనపు కట్నం కోసం ఎస్సై వేధింపులు - గుంటూరు జిల్లా తాజా వార్తలు

Harassment: ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి, రెండు నెలల పాటు సాఫీగా సాగిన ఆమె సంసారంలో వరకట్నం అనే రాకాసి చిచ్చురేపింది. పెళ్లికి ముందు పరిచయం పెట్టుకొని మూడేళ్లపాటు సన్నిహితంగా ఉన్న అతడు.. పెళ్లైన రెండు నెలలకే తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. అధిక కట్నం కోసం భర్తతో పాటు అత్తమామలు, ఆడబిడ్డలు చిత్రహింసలు పెట్టారు. దాంతో విసుగు చెందిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయం తెలుసుకొని కోపోద్రిక్తుడైన అతడు కొట్టి.. గొంతు నులిమి చంపటానికి ప్రయత్నించాడు. "నేను పోలీసు.. నీవు ఒంటరిదానివి" ఏం చేయలేవు నీకు దిక్కున్నచోట చెప్పుకోమంటూ బెదిరించాడు. ఈ అమానవీయ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

Harassment
అదనపు కట్నం కోసం ఎస్సై వేధింపులు
author img

By

Published : May 1, 2022, 10:16 AM IST

Harassment: వివాహమైన రెండు నెలలకే అధిక కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ భర్త ఎస్సైపై భార్య రోజారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం గుంటూరులో ఆమె విలేకరులతో మాట్లాడారు.

"మాది మంగళగిరి ఆత్మకూరు. తండ్రి నా చిన్నతనంలో చనిపోయారు. తల్లి టైలరింగ్‌ చేస్తూ నన్ను ఫిజియోథెరపీ చదివించింది. 2019లో మంగళగిరిలో శిక్షణ ఎస్సైగా వచ్చిన వినోద్‌కుమార్‌ నాతో పరిచయం పెట్టుకొని మూడేళ్లపాటు సన్నిహితంగా ఉన్నాడు. అప్పుడు నేను ఫిజియోథెరపిస్టుగా పనిచేసిన డబ్బులు రూ. 12 లక్షలతో బంగారం, కారు ఇచ్చాను. ఎంగేజ్‌మెంట్‌కు రూ. 6 లక్షలు, గృహ నిర్మాణానికి రూ. 6 లక్షలు, ఇతర ఖర్చులకు రూ. 8 లక్షలు ఇచ్చాను. 2021 ఆగస్టులో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాం. రెండు నెలలు బాగున్నాడు. ఆ తర్వాత నన్ను ఉద్యోగం మాన్పించాడు. నా వద్ద డబ్బులులేవు. నన్ను అధిక కట్నం కోసం వేధించేవాడు. అతనితోపాటు అత్తమామలు, ఆడబిడ్డలు చిత్రహింసలుపెట్టారు. ఈ విషయమై పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశానని నన్ను కొట్టి గొంతు నులిమి చంపటానికి ప్రయత్నించాడు. తాను పోలీసునని.. నీవు ఒంటరిదానివి ఏం చేయలేవు నీకు దిక్కున్నచోట చెప్పుకోమంటూ బెదిరించాడు.

మా అమ్మ కోటేశ్వరమ్మ మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేసిందని కక్ష పెంచుకొని నా జీవితం నాశనం చేస్తానంటూ బెదిరించాడు. మేడికొండూరులో పనిచేసి పెదకాకానికి వచ్చాడు. ఇప్పుడు అతన్ని ఒంగోలు పోలీసు శిక్షణ శిబిరానికి బదిలీ చేశారు. మా అత్తమామలు అతనికే వత్తాసు పలుకుతున్నారు. నా అడ్డు తొలగిపోతే తన కుమారుడికి మళ్లీ పెళ్లి చేస్తే రూ. కోటి కట్నం వస్తుందని వేధించారు. సీఐ, డీఎస్పీ పోలీసు అధికారులందరి వద్దకు తిరుగుతున్నా నాకు న్యాయం చేయడం లేదు. మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసినా.. అందులో నన్ను చిత్రహింసలు పెట్టిన కొన్ని సెక్షన్లు పెట్టలేదు. పెళ్లి చేసుకొని రూ. లక్షల నగదు వాడుకొని నన్ను నడిరోడ్డుపై వదిలేశారు. ఇప్పటికైనా నాకు న్యాయం చేయాలని అని బాధితురాలు రోజారాణి తెలిపింది.

ఇలా ఉండగా విషయం తెలుసుకున్న గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ ఆమెను తన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. ఫిర్యాదుపై విచారణ చేయించి అతనిపై తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఆమెకు భరోసా ఇచ్చారు. ఎస్సై వినోద్‌కుమార్‌పై ఆయన భార్య ఫిర్యాదు మేరకు అదనపు కట్నం వేధింపుల కేసు నమోదు చేశామని మంగళగిరి సీఐ వి.భూషణం తెలిపారు.

ఇదీ చదవండి: Councellors disputes: చీరాలలో వైకాపా కౌన్సిలర్ల తోపులాట.. ఇద్దరు సభ్యుల సస్పెన్షన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.