ETV Bharat / crime

Sexual assault: భర్త ఇంట్లోలేని సమయంలో.. వాలంటీరు ప్రవేశించి - ఏపీ క్రైమ్​ న్యూస్

Sexual assault: ప్రజలకు సంక్షేమ పథకాలను చేరవేయాల్సిన ఓ వాలంటీరు.. దుర్మార్గానికి పాల్పడ్డాడు. తన వార్డులోని ఓ వివాహిత ఫోన్​కు అసభ్యకరమైన సందేశాలు పంపించి.. భర్త లేని సమయంలో నేరుగా ఆమె ఇంటికి వెళ్లి లైంగిక దాడికి యత్నించాడు.

Sexual assault
Sexual assault
author img

By

Published : Jan 9, 2022, 3:41 PM IST

Sexual assault: లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను చేరవేయాల్సిన ఓ వాలంటీరు.. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తన వార్డులోని ఓ వివాహిత ఫోన్​కు అసభ్యకరమైన సందేశాలు పంపించడమే కాకుండా.. భర్త లేని సమయంలో నేరుగా ఆమె ఇంటికి వెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన కడప జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కడప జిల్లా ప్రొద్దుటూరు పురపాలక పరిధిలోని ఆరో వార్డులో.. జమాల్ వలి వాలంటీరుగా పనిచేస్తున్నాడు. అదే వార్డుకు చెందిన ఓ వివాహితకు ఫోన్​ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపించాడు.

భర్త లేని సమయంలో నేరుగా ఆమె ఇంటికి వెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. దీంతో.. ఆ వివాహిత మూడో పట్టణ పోలీస్​ స్టేషన్​ను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. సీఐ ఆనందరావు ఈ వివరాలు వెల్లడించారు.

ఇదీ చదవండి: Latest Trends in Cybercrime: 5 సెకన్లు నగ్నంగా కనిపిస్తారు.. చూశారంటే ఇక అంతే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.