ETV Bharat / crime

విశాఖలో ఆన్​లైన్ పార్ట్ టైం ఉద్యోగాల పేరిట మోసాలు.. ముఠా అరెస్ట్ - నేటి ఏపీ వార్తలు

Cyber Crime In Visakha : ఆన్ లైన్ పార్ట్ టైం ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్న ముఠాను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట స్థాయిలో నకిలీ బ్యాంకు ఖాతాలను సృష్టిస్తున్న వారిని అదుపులోకి తీసుకోవటం జరిగిందని, విచారణ కొనసాగుతుందని విశాఖ నగర పోలీసు కమిషనర్‌ శ్రీకాంత్ వివరాలను వెల్లడించారు. విశాఖనగర పరిధిలో ఆన్​లైన్​ ఉద్యోగాల పేరిట లింక్ లను తెరిచి మోసపోతున్నట్లు పలు ఫిర్యాదులు అందుతున్నాయని, అయితే అక్టోబరు 13న ఒక మహిళ తాను రూ.12,83,670 నగదును పోగొట్టుకున్నట్లు వచ్చిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ సీఐ భవానీ ప్రసాద్ నేతృత్వంలోని బృందం ప్రత్యేక దర్యాప్తును ప్రారంభించి నిందితులను పట్టుకున్నారు.

Cyber  Crime
సైబర్ క్రైమ్
author img

By

Published : Dec 29, 2022, 4:40 PM IST

Cyber Crime In Visakha : ఆన్‌లైన్‌ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. పలువురు బాధితులు ఈ ముఠా బారినపడి మోసపోయారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నకిలీ సిమ్‌లను సిద్ధం చేస్తున్న సుమన్ షాను.. లేని కంపెనీలను సృష్టించి, బ్యాంకు ఖాతాలను తెరుస్తున్న సుభమ్ సింగ్, దీపక్ సంగ్ర, రణవీర్ చౌహన్, మిట్టు లాల్, వికాస్​లను అరెస్టు చేసి వారి నుంచి 5 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు విశాఖ సీపీ శ్రీకాంత్ వెల్లడించారు.. అయితే అక్టోబరు 13న ఒక మహిళ తాను రూ.12,83,670 నగదును పోగొట్టుకున్నట్లు వచ్చిన ఫిర్యాదు అందిందని.. దీనిపై బృందం ప్రత్యేక దర్యాప్తును ప్రారంభించి నిందితులను పట్టుకున్నారు. అనంతరం నిందితుల నుంచి 30 ఫోన్లు, 20 సిమ్ కార్డులు, 26 ఏటీఎం కార్డులు, 37 బ్యాంకు చెక్కులు, 56 నకిలీ స్టాంపులు, నకిలీ సంస్థల పేర్లతో కూడిన ప్లెక్సీలను స్వాధీనం చేసుకున్నారు.

విశాఖ నగర పోలీసు కమిషనర్‌ శ్రీకాంత్

ఈ కేసులో రూ.13 లక్షలు పోతే రూ.5 లక్షలు ఎస్ బ్యాంక్ నుంచి ఫ్రీజ్ చేయడం జరిగింది. విశాఖ నగర పరిధిలో ఈ ఏడాదిలో ఈ తరహా మోసాల బారిన పడినట్లుగా మొత్తం 78 మంది ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదుదారులు మొత్తం రూ.2.45 కోట్లను పొగొట్టుకున్నారు. వీరిలో 38 మంది గృహిణులు ఉండగా, 21 మంది నిరుద్యోగులు, ముగ్గురు ప్రైవేటు ఉద్యోగులు, ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులు, ఇద్దరు వైద్యులు కూడా ఉన్నారు. ఇంట్లోనే ఉంటూ ఎలాంటి కష్టం లేకుండా ఎక్కువమొత్తంలో నగదు సంపాదించాలన్న అత్యాశ కారణంగా ఎక్కువ మంది సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు.. ఈ తరహా మోసాల బారిన పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలి. -సీపీ శ్రీకాంత్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.