ETV Bharat / crime

ప్రేమోన్మాదులు ‘బతుకు’నీయడం లేదు

ప్రేమోనాద్ముల చేతిలో దాడికి గురైన కొందరు ప్రాణాలు కోల్పోతే.. మరికొందరు అతికష్టం మీద బతికారు. వారిని బతికించుకునేందుకు వాళ్ల తల్లిదండ్రులు ఉన్న ఆస్తులు కూడా అమ్ముకునే పరిస్థితి. పోలీసులు నిందితులు పట్టుకున్నా.. ప్రభుత్వం ఆర్థిక సాయం చేసినా.. బాధిత కుటుంబాలకు మాత్రం కష్టాలు తప్పట్లేదు. ఓ వైపు నిందితులు బెయిల్​పై వచ్చి బాధితులను, వారి కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరిస్తున్నా... ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

victims-family-members-facing-problems-after-daughters-murdered-by-her-lover
ప్రేమోన్మాదులు ‘బతుకు’నీయడం లేదు
author img

By

Published : Sep 8, 2021, 8:22 AM IST

ప్రేమోన్మాదులు ‘బతుకు’నీయడం లేదు

విశాఖలో ఓ వరలక్ష్మి, ఓ ప్రియాంక, బద్వేలులో శిరీష, ధర్మవరంలో స్నేహలత, ప్రొద్దుటూరులో లావణ్య.. వీరంతా ప్రేమోన్మాదుల చేతిలో దాడికి గురైన బాధితులే. వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోతే మరికొందరు కష్టమ్మీద బతికారు. ఆ కుటుంబాలకు న్యాయం చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన మాట ఆచరణకు నోచుకోలేదు. దీంతో బాధిత కుటుంబాలకు అంతులేని క్షోభ మిగులుతోంది. ఇందులో కొందరు బిడ్డలను బతికించుకోవడానికి ఉన్నవన్నీ అమ్ముకున్నారు. అదీ చాలక అందినకాడికి అప్పులు చేశారు. అప్పటికే ఇంట్లో జరిగిన విషాద ఘటన నుంచి కోలుకోలేక అంతులేని మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. మరోవైపు జైలు నుంచి బయటకొచ్చిన నిందితులు తమను బెదిరిస్తుండటంతో బాధిత కుటుంబాల్లో ఆవేదన కట్టలు తెంచుకుంటోంది. దోషులకు శిక్ష పడకపోవడం, కళ్ల ముందే నిందితులు దర్జాగా తిరగడం చూసి వారిలో ఆక్రోశం పెల్లుబుకుతోంది. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే పదే పదే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని వారంతా వాపోతున్నారు. గత ఏడాది కాలవ్యవధిలో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రేమోన్మాద దాడుల ఘటనల్లో బాధితుల తల్లిదండ్రులతో ‘ఈనాడు- ఈటీవీ-ఈటీవీ భారత్ ఆంధ్రప్రదేశ్‌’ మాట్లాడింది. వారి ఆవేదనపై ప్రత్యేక కథనం.

గొంతుకోసి చంపి.. బెయిలుపై బయటకు..

2020 అక్టోబరు 31 విశాఖపట్నంలో ఇంటర్మీడియట్‌ విద్యార్థిని వరలక్ష్మిని గొంతు కోసి చంపేశారు. పోలీసులు అభియోగపత్రం దాఖలుచేశారు.కేసు విచారణలో ఉంది. నిందితుడు అఖిల్‌ బెయిలుపై బయటకొచ్చాడు.

ఇలాగైతే ఆడపిల్లలకు రక్షణ ఎలా?

మా అమ్మాయిని చంపిన వ్యక్తి మా కళ్లముందే కాలర్‌ ఎగరేసుకుని తిరుగుతుంటే నిస్సహాయంగా చూస్తున్నాం. దిశ చట్టం ప్రకారం వెంటనే శిక్ష పడుతుందన్నారు. ఇప్పటివరకూ పడలేదు. మా అమ్మాయి చనిపోయినప్పటి నుంచి నా భార్య తరచూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతోంది. ఆమెకు ఏమవుతుందోనని భయమేస్తోంది. నేరాలకు పాల్పడినవారు స్వేచ్ఛగా తిరుగుతుంటే ఆడపిల్లలకు రక్షణ ఏం ఉంటుంది? ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావుడి చేస్తున్నారు. తర్వాత పట్టించుకోవడం లేదు. వ్యవస్థపైనే విరక్తి కలుగుతోంది. ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని ఎదురుచూస్తున్నా. ప్రభుత్వం మీకు రూ.10 లక్షల పరిహారం ఇచ్చింది కదా అంటున్నారు. మేం డబ్బులు అడగలేదు.. మాకు న్యాయం చేయాలని, మరో అమ్మాయికి ఇలా జరగకూడదని మాత్రమే కోరాం. - సత్య గురునాథ్‌ (హరి), వరలక్ష్మి తండ్రి

2021 జూన్‌ 18: కడప జిల్లా బద్వేలు మండలం చింతలచెరువుకు చెందిన శిరీషను కత్తితో పొడిచి చంపిన కేసులో చరణ్‌రాజ్‌, నాయబ్‌ రసూల్‌, నరసింహం నిందితులు. రసూల్‌, నరసింహం బెయిల్‌పై బయటకొచ్చారు. చరణ్‌రాజ్‌పై పోలీసులు రౌడీషీట్‌ తెరిచి, రిమాండ్‌లో ఉంచారు. అభియోగపత్రం దాఖలైంది. కేసు విచారణలో ఉంది.

నిందితులు బయటికొచ్చి బెదిరిస్తున్నారు...

నిందితుల్లో ఇద్దరు ఇప్పటికే బయటకొచ్చి, మమ్మల్ని బెదిరిస్తున్నారు. బెయిల్‌ కోసం రూ.1.30 లక్షలు ఖర్చుచేశామని, తమకేం కాదని, మేం వాళ్లనేమీ చేయలేమని సవాల్‌ చేస్తున్నారు. మా అమ్మాయిని చంపిన ప్రధాన నిందితుడు జైలు నుంచి బయటకు వస్తే ఇంటిల్లిపాదీ విషం తీసుకుని చావడం తప్ప.. మరో మార్గం లేదు. అతనివల్ల మా ప్రాణాలకు ముప్పు ఉంది. మా అమ్మాయిని ఎంత ఘోరంగా చంపారో.. అంతే నరకం చూపించి వారికి మరణశిక్ష వేయాలి. ఏ అమ్మాయి జోలికైనా వెళ్లాలంటే భయపడేలా శిక్ష వేయాలి. మా అమ్మాయికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు. మాకేమో వారిపై పోరాడేంత ఆర్థిక స్థోమత లేదు. ప్రభుత్వం రూ.5 లక్షలు ఆర్థికసాయం అందించింది. నా కుమారుడికి పొరుగుసేవల ఉద్యోగం ఇచ్చారు. సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మా అమ్మాయిని హతమార్చిన నిందితులు ముగ్గురికీ ఉరిశిక్ష పడితేనే మాకు న్యాయం జరుగుతుంది. - జి.సుబ్బయ్య, శిరీష తండ్రి, చింతలచెరువు గ్రామం, కడప జిల్లా

ఏడాది వ్యవధిలో జరిగిన దాడులు

2020 అక్టోబరు 15: విజయవాడలో బీటెక్‌ విద్యార్థిని దివ్య తేజస్విని (20)ని ఆమె ఇంట్లోనే కత్తితో పొడిచి హతమార్చిన ఘటనలో నాగేంద్రబాబు నిందితుడు. ఈ కేసులో అభియోగపత్రం దాఖలైంది. నిందితుడు బెయిల్‌పై ఉన్నారు. అతనిపై రౌడీషీట్‌ తెరిచారు.
2021 ఆగస్టు 15: గుంటూరులో నడిరోడ్డుపై రమ్య అనే యువతిని కత్తితో పొడిచిన ఘటనలో శశికృష్ణ నిందితుడు. ఈ కేసులో పోలీసులు అభియోగపత్రం దాఖలు చేశారు. నిందితుడు రిమాండులో ఉన్నాడు.

భూమి, ఉద్యోగం ఇస్తే న్యాయం జరిగినట్లేనా?

2020 డిసెంబరు 23: అనంతపురం జిల్లా ధర్మవరం స్టేట్‌బ్యాంకులో పొరుగుసేవల ఉద్యోగిని కె.స్నేహలతను హతమార్చిన కేసులో రాజేష్‌, కార్తీక్‌ నిందితులు. కేసులో అభియోగపత్రం దాఖలైంది. విచారణ నడుస్తోంది. ప్రధాన నిందితుడు రాజేష్‌ జైల్లో ఉండగా కార్తీక్‌ బెయిల్‌పై బయటకొచ్చాడు.

అన్యాయం జరిగినప్పుడే స్పందించి ఉంటే..

మా అమ్మాయిని చంపిన వారిపై కఠినచర్యలు తీసుకోలేదు. అందుకే ఇటీవల గుంటూరులో రమ్య అనే యువతిని మరొకడు నడిరోడ్డుపై హతమార్చాడు. మాకు అన్యాయం జరిగినప్పుడే కఠినంగా వ్యవహరించి ఉంటే... ఇప్పుడు మరో బిడ్డ బలయ్యేది కాదు కదా! ప్రభుత్వం మాకు భూమి, నా భార్యకు ఉద్యోగం ఇచ్చింది. అంతమాత్రాన మాకు న్యాయం జరిగినట్లేనా? దోషులకు మరణశిక్ష పడితేనే మాకు న్యాయం జరిగినట్లు. దోషుల్ని శిక్షించకుండా బాధితులకు డబ్బులు, స్థలాలు ఇచ్చేసి సరిపెట్టేస్తామంటే.. ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంటాయి. - కె.కుళ్లాయప్ప, స్నేహలత తండ్రి

ప్రభుత్వం సాయం చేయలేదు..

2021 జనవరి 22: కడప జిల్లా ప్రొద్దుటూరు నేతాజీనగర్‌కు చెందిన లావణ్యపై ఓ యువకుడు కత్తితో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో పోలీసులు అభియోగపత్రం దాఖలు చేశారు. కేసు విచారణలో ఉంది. నిందితుడు సునీల్‌కుమార్‌ బెయిల్‌పై బయటే ఉన్నాడు.

ఇంట్లో శవం లేస్తుందని బెదిరిస్తున్నాడు...

మా అమ్మాయిపై హత్యాయత్నానికి తెగబడ్డ సునీల్‌ జైలు నుంచి విడుదలయ్యాడు. రోజూ మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ‘వారంలో మీ ఇంట్లో శవం లేస్తుంది.. వీలైతే నీ వాళ్లను కాపాడుకో’ అని రెండు రోజుల కిందట మా అల్లుడికి వాట్సప్‌ సందేశం పంపాడు. మేం రోడ్డుపక్కన కోడిగుడ్లు అమ్ముకుని జీవిస్తుంటాం. ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాడోనని భయంతో గడుపుతున్నాం. మా అమ్మాయిని విజయవాడలో ఓ కళాశాలలో చేర్పించాలనుకున్నాం. ఆ కళాశాల తనకు తెలుసని సునీల్‌ భయపెడుతున్నాడు. మా అమ్మాయికి తలకు, చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. చికిత్సకు రూ.10 లక్షలు ఖర్చయినా ప్రభుత్వం నుంచి రూపాయి కూడా సాయం అందలేదు. ఇంట్లో ఉన్న బంగారమంతా అమ్మేసి శస్త్రచికిత్స చేయించాం. ఇప్పటికీ కోలుకోలేదు. శిక్షపడే వరకూ సునీల్‌ను జైల్లోనే ఉంచాలి. - శ్రీనివాస్‌, లావణ్య తండ్రి

బిడ్డను బతికించుకోవడానికి పుస్తెలమ్మాను...

2020 డిసెంబరు 1: విశాఖపట్నం థామ్సన్‌పేటలో నివసిస్తున్న వార్డు వాలంటీరు సాయి ఈశ్వర ప్రియాంకపై శ్రీకాంత్‌ అనే యువకుడు కత్తితో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో పోలీసులు అభియోగపత్రం దాఖలు చేశారు. నిందితుడు బెయిల్‌పై ఉన్నాడు.

శిక్ష పడాల్సిందే..!

మా పక్కింట్లో ఉండే శ్రీకాంత్‌ బ్లేడుతో మా అమ్మాయి గొంతు కోసేశాడు. నెల రోజులు చావుతో పోరాడింది. ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. నా భర్త రోజు కూలి. నా కుమార్తె వాలంటీరు. అయినా ప్రభుత్వం పైసా కూడా సాయం చేయలేదు. ముంబయిలో శస్త్రచికిత్సకు రూ.9 లక్షలు ఖర్చవుతాయని చెబితే.. శస్త్రచికిత్స చేయించుకుని తర్వాత బిల్లు పెట్టుకోండి అన్నారు. ట్విటర్‌లో సాయం అర్థిస్తే క్రికెటర్‌ హనుమ విహారి ఫౌండేషన్‌ వారు స్పందించి రూ.5 లక్షలు పంపించారు. నా పుస్తెలమ్మి, అప్పులు చేసి మరో రూ.4 లక్షలు సమకూర్చుకున్నాం. 5 మాసాల పాటు ప్రతి నెలా ముంబయికి వెళ్లాలి. మా దగ్గర డబ్బుల్లేవు. నేరానికి పాల్పడిన వారికి వెంటనే శిక్ష పడితేనే మళ్లీ అలాంటివి జరగకుండా ఉంటాయి. శ్రీకాంత్‌ను కఠినంగా శిక్షించాలి. - రమణమ్మ, ప్రియాంక తల్లి

దిశ బిల్లుపై చర్చలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి

‘మహిళలు, చిన్నారులపై ఏదైనా అఘాయిత్యం, నేరం జరిగినప్పుడు దానిపై అందరూ మాట్లాడతారు. వారం తర్వాత మరిచిపోతారు. అలాకాకుండా ఇలాంటి ఘటన వారింట్లో జరిగితే ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అలా పుట్టుకొచ్చిందే దిశ చట్టం. ఇది ఒక విప్లవాత్మక నిర్ణయం. దీనిపై దేశమంతా చర్చ జరుగుతోంది. వేగవంతమైన దర్యాప్తు, సత్వర విచారణ, శిక్ష ఖరారుతోనే నేర నియంత్రణ సాధ్యం. ఘటన జరిగిన వారం రోజుల్లో సాక్ష్యాధారాల సేకరణతో పాటు దర్యాప్తు పూర్తిచేయాలి. 14 రోజుల్లోగా న్యాయస్థానాల్లో విచారణ ముగియాలి. మొత్తం 21 పనిదినాల్లో దోషులకు ఉరిశిక్ష పడాలి. అందుకు వీలుగా దిశ, ప్రత్యేక న్యాయస్థానాల చట్టాలను తీసుకొస్తున్నాం’.

- 2019 డిసెంబరు 13న అసెంబ్లీలో దిశ బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి

ఇదీ చూడండి: RAINS : ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు... మునిగిన ఏజెన్సీలోని పలు ప్రాంతాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.