ETV Bharat / crime

గుంటూరు జిల్లాలో రెండేళ్ల బాలుడు అపహరణ.. రంగంలోకి పోలీసులు!

author img

By

Published : Feb 24, 2021, 8:41 PM IST

Updated : Feb 24, 2021, 10:03 PM IST

రెండేళ్ల కుమారుడిని గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి ఎత్తుకెళ్లిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

two year old boy kidnapped in guntur district

గుంటూరు జిల్లా నంబూరు యానాది కాలనీలో రెండేళ్ల బాలుడు అపహరణకు గురయ్యాడు. కారులో నలుగురు వచ్చి తీసుకెళ్లినట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పెదకాకాని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు చెప్పిన వివరాలు ప్రకారం.... బాల, ముసలయ్య దంపతులు పెదకాకాని మండలం నంబూరు రోడ్డులోని యానాది కాలనీలో నివాసం ఉంటున్నారు. మధ్యాహ్న సమయంలో ఓ నల్ల కారు అక్కడకు వచ్చి ఆగింది. అందులో నుంచి ఇరువురు వ్యక్తులు దిగి అక్కడ ఉన్న చెట్టు కింద కొద్దిసేపు నిలుచున్నారు. తరువాత మంచినీళ్లు కావాలని బాల వద్దకు రాగా డబ్బా తీసుకుని నీళ్ళు పోసేందుకు లోపలికి వెళ్ళింది. బయటకు వచ్చేసరికి కారు లేకపోవడం ఇంట్లో పిల్లోడు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. కారులో వచ్చిన వారే తమ కుమారుడిని తీసుకువెళ్ళి ఉంటారని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి

ఏపీఎస్ఆర్టీసీకి వరుసగా రెండోసారి జాతీయ అవార్డు

Last Updated : Feb 24, 2021, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.