ETV Bharat / crime

అత్తాకోడళ్ల ఉసురు తీసిన రుణ వేధింపులు

Harassment By Recovery Agents: సొంతింటి కల నెర్చుకోవాలని ఓ కుటుంబం ప్రైవేట్ సంస్థ నుంచి రుణం తీసుకోవడం వల్ల..వాళ్లు కన్న కలలన్నీ ఆవిరైపోయాయి.. ఓ నెల వాయిదా.. సమయానికి చెల్లించలేదని.. సంస్థ అధికారుల వేధింపులు ..ఆ కుటుంబంలో ఇద్దరు మహిళలు మరణానికి దారితీసాయి..

రుణ వేధింపులు
Harassment By Recovery Agents
author img

By

Published : Dec 26, 2022, 8:24 AM IST

Updated : Dec 26, 2022, 12:44 PM IST

Harassment By Recovery Agents: ఓ సూక్ష్మరుణ సంస్థ సిబ్బంది దౌర్జన్యంగా వ్యవహరించడం.. అత్తాకోడళ్ల ప్రాణాలు తీసింది. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్‌ పంచాయతీ పరిధి బెల్లంకొండవారి మెరకకు చెందిన సుందర వెంకటేశ్వరరావు, రవిబాబు తండ్రీకుమారులు. రవిబాబు భవన నిర్మాణ కార్మికుడు. ఇంటి నిర్మాణం కోసం రెండు ప్రైవేటు సూక్ష్మరుణ సంస్థల వద్ద.. ఐదేళ్ల క్రితం రుణం తీసుకున్నారు. రుణ వాయిదాలు సక్రమంగానే చెల్లిస్తూ వచ్చారు. ఫుల్ట్రాన్‌ సంస్థలో తీసుకున్న రుణం ఐదున్నర లక్షలకు గానూ నెలకు 12 వేల 500 రూపాయల చొప్పున ఇప్పటివరకూ 56 వాయిదాలు చెల్లించారు.

ఈ నెల 7న చెల్లించాల్సిన వాయిదా ఆలస్యమైంది. ఈ నెల 23న ఆ సంస్థ ఉద్యోగులు వచ్చి.. వెంటనే చెల్లించకపోతే ఇంటికి తాళం వేసి వేలం వేస్తామని బెదిరించారు. ఆందోళన చెందిన రవి భార్య భారతి శనివారం గుండెపోటుతో మరణించారు. కోడలి మరణంతో కలత చెందిన అత్త అంజమ్మ.. ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నారు. రవిబాబు, భారతి దంపతులకు నాలుగేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. చిన్నారుల ఆలనాపాలనా చూసే తల్లి, నాయనమ్మ ఒకేసారి దూరం కావడం.. ఆ కుటుంబంలో పెను విషాదం నింపింది..

ఇవీ చదవండి:

Last Updated : Dec 26, 2022, 12:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.