తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం, గొల్లప్రోలు రెండు రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై స్త్రీ పురుషుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లిన రైలు నుంచి మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో ప్రమాదవశాత్తు జారిపడి ఉంటారని తుని రైల్వే పోలీస్ అధికారులు ప్రాథమికంగా పేర్కొన్నారు.
పురుషుడుది శ్రీకాకుళం..
పురుషుడి వద్ద ఉన్న ఆధారాలను బట్టి శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి గా గుర్తించారు. బాధిత మహిళ వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడం వల్ల ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తో ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. మృత దేహాలను తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి : ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఉరేసుకుని ఆత్మహత్య