ETV Bharat / crime

Attack With Knifes: పట్టపగలే కత్తులతో దాడి.. ఇంతకీ ఏమైందటే.. - నెల్లూరు జిల్లా జలదంకి మండలం

Attack: ఇద్దరు వ్యక్తుల మధ్య ఆస్తి తగాద చివరికి ఓ వ్యక్తి ప్రాణాల మీదకి వచ్చింది. గొడవ పరిష్కరించడానికి వెళ్లిన అతనికి ఊహించని పరిణామం ఎదురైంది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Sep 15, 2022, 2:00 PM IST

Attack With Knifes: పట్టపగలు అందరూ చూస్తుండగానే ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో ఇద్దరు వ్యక్తులు నాగిశెట్టి మధు అనే వ్యక్తి పై కత్తులతో దాడి చేశారు. దాడిని అడ్డుకోడానికి ప్రయత్నించిన మరో ముగ్గురిపై కూడా దాడి చేశారు. ప్రతీకారమే దాడికి కారణం కాగా.. ఈ ఘటనతో స్థానికులు భయందోళనకు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన నాగిశెట్టి మధు, మరో ముగ్గురిని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా జలదంకి మండలంలోని శనివరపు హరికృష్ణకు అతని తల్లికి మధ్య ఆస్తి వివాదాలు ఉండేవి. ఆమె మరణానంతరం ఆస్తివివాదాలు తలెత్తడంతో నాగిశెట్టి మధు మధ్యవర్తిత్వం చేశాడు. మధ్య వర్తిత్వం ఏకపక్షంగా చేశావనే ప్రతీకారంతో శనివరపు హరికృష్ణ, శనివరపు నరసింహనాయుడు ఇద్దరు కలిసి నాగిశెట్టి మధు పై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిని అడ్డుకోడానికి ప్రయత్నించిన పాలంకి మధు, పాలంకి లక్ష్మణ్​, సురేష్ లపై సైతం కత్తులతో దాడి చేశారు. గాయపడిన వీరిని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.