ETV Bharat / crime

ఓ రాజకీయ పార్టీకి చెందిన హీలియం బెలూన్ పేలుడు.. ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు - ఏపీ నేర వార్తలు

Two Childrens Injured in Helium Balloon Explosion : ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హీలియం బెలూన్​ పేలి ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన చిన్నారులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.

helium balloon explosion
హీలియం బెలూన్
author img

By

Published : Dec 27, 2022, 4:58 PM IST

Updated : Dec 27, 2022, 5:35 PM IST

Two Childrens Injured in Helium Balloon Explosion : ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో హీలియం బెలూన్ పేలి ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన చిన్నారులను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు అంటున్నారు. ఆగిరిపల్లికి చెందిన షేక్ అలియా అనే మహిళ బ్యాంకులో పని ఉండగా.. బ్యాంకుకు వెళ్ళింది. బ్యాంకుకు వెళ్లే సమయంలో.. ఆమెతో తన కుమార్తెతో పాటు మరో బాలికను బ్యాంకుకు తీసుకువెళ్ళింది.

అలియా బ్యాంకులో పనిచేసుకుంటున్న సమయంలో చిన్నారులిద్దరూ బ్యాంకు మేడపైకి వెళ్లి అడుకుంటుండగా.. అదే సమయంలో ఓ పార్టీకి చెందిన భారీ హీలియం బెలూన్ పేలిందని గాయపడిన బాలికి తండ్రి తెలిపారు. ఈ పేలుడు ధాటీకి చిన్నారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన చిన్నారులలో ఒకరి వయస్సు ఆరు సంవత్సరాలు కాగా మరో చిన్నారి వయస్సు 12 సంవత్సరాలని తెలుస్తోంది.

"ఇద్దరు చిన్నారులు కాలిన గాయలతో ఆసుపత్రిలో చేరారు. వారిలో ఒక పాపకు 65 శాతం కాలిన గాయాలయ్యాయి. ఇంకో పాపకి 50 శాతం కాలిన గాయలయ్యాయి. బెలూన్​ పేలటంతో దాని భాగాలు చిన్నారులపై పడి గాయాలయ్యాయి. వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నాము. వారి పరిస్థితి కొంచెం తీవ్రంగా ఉంది. ఇప్పుడేమి చెప్పలేము." -సౌభాగ్యలక్ష్మి, సూపరింటెండెంట్, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి

"బ్యాంకు బిల్డింగ్​ పైన బెలూన్​ ఒకటి ఉంది. బిల్డింగ్​ పైకి ఎక్కి పిల్లలు అడుకుంటుండగా అది పేలి పిల్లలకు గాయాలయ్యాయి. వైద్యులు పిల్లల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అంటున్నారు." - గాయపడిన బాలిక తండ్రి, విజయవాడ

హీలియం బెలూన్​ పేలి ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు

ఇవీ చదవండి:

Last Updated : Dec 27, 2022, 5:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.