ETV Bharat / crime

Crime News: భార్యను చంపి లొంగిపోయిన భర్త.. అదే కారణమా? - ఆంధ్రప్రదేశ్​ తాజా నేర సమాచారం

రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో పలు ఘటనలు జరిగాయి. పలు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. విజయవాడలో భార్యను గొంతు కోసి చంపాడో భర్త. శ్రీకాకుళంలో యువతిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. కర్నూలులో కరెంట్​ స్థంభాన్ని ఆటో ఢీకొట్టింది. కర్నూలు కారాగారం నుంచి నిందితుడు తప్పించుకున్నాడు.

andhra pradesh crime news
భార్యను చంపి లొంగిపోయిన భర్త.. అదే కారణమా?
author img

By

Published : Mar 14, 2022, 1:26 PM IST

కృష్ణా జిల్లా ముదినేపల్లి పోలరాజు కాలువలో గల్లంతైన బాలుడు నాగచైతన్య మృతదేహాన్ని ప్రత్యేక బృందాలు గుర్తించాయి. కాలువ గట్టుపై ఆడుకుంటుండగా, ప్రమాదవశాత్తు కాలువలో జారి పడిన నాగ చైతన్య విగత జీవుడై బయటకు వచ్చాడు. ప్రత్యేక బృందాల ద్వారా రెండు గంటల పాటు అధికార యంత్రాంగం చేసిన కృషి ఫలించి గుర్రపు డెక్క కింద నాగ చైతన్య మృతదేహం లభ్యమైంది. మృతుడి భౌతికకాయాన్ని చూసిన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బోరుమంటూ విలపిస్తున్నారు. కళ్ళముందు ఆడుకుంటూ తిరిగే బాలుడి మృతిని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇదీ జరిగింది...

కృష్ణా జిల్లా ముదినేపల్లి గ్రామానికి చెందిన నాగ చైతన్య అతని తమ్ముడు వరుణ్ తేజతో కలిసి పొలరాజు కాలువ గట్టుపై ఆడుకుంటుండగా, ప్రమాదవశాత్తు కాల్వలో జారి పడ్డాడు. కాలువలో అధిక స్థాయిలో పేరుకుపోయిన గుర్రపు డెక్క కింద ఉన్న నీటి ప్రవాహానికి బాలుడు కొట్టుకుపోగా,స్థానికులు ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ లభ్యం కాలేదు. ప్రత్యేక బృందాల ద్వారా పోలరాజు కాలువలో అధికారులు వెతుకులాట ప్రారంభించారు.

భార్య గొంతుకోసి చంపిన భర్త....

విభేదాల కారణంగా భార్యను గొంతు కోసి ఆ తర్వాత పోలీస్​స్టేషన్​లో లొంగిపోయాడు ఓ భర్త. ఈ ఘటన విజయవాడ గవర్నర్​పేటలో జరిగింది. కంచికచర్ల గ్రామానికి చెందిన అమ్మాయితో కంచికచర్ల మండలం వేములపల్లి గ్రామానికి చెందిన ప్రసాద్​ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. కొన్ని విభేదాల కారణంతో విడిగా ఉంటున్నారు. ఆదివారం రాత్రి సుమారు పది గంటలకు ప్రసాద్ అనే వ్యక్తి అతని భార్యతో కలిసి పాత బస్టాండ్ ఎదురుగా గల అశోకా రెసిడెన్సి లాడ్జ్​లో ఒక గది తీసుకున్నాడు. రాత్రి రెండు గంటలకు బయటికి వెళ్లి జ్యూస్ తీసుకొని వచ్చి ఇచ్చి మళ్లీ బయటకి వెళ్లి తిరిగి రాలేదు. లాడ్జిలోని వారికి అనుమానం వచ్చి రూమ్ దగ్గరకు వెళ్లి చూడగా డోరు తాళం వేయలేదు. సదరు ప్రసాద్​కు ఫోన్ చేయగా బయటకి వెళ్లానని, ఇప్పుడే వస్తానని చెప్పినట్లు తెలిపారు. అశోక్ లాడ్జి సిబ్బంది గవర్నర్​పేట పోలీస్​స్టేషన్​కు సమాచారం అందించారు. కంచికచర్ల పోలీస్​స్టేషన్లో లొంగిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై గవర్నర్‌పేట పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఎస్​బీఐ సేవా కేంద్రం నిర్వాహకుడు ఆత్మహత్య

అనంతపురం జిల్లా మడకశిర మండలం కల్లుమరి గ్రామంలో ఎస్​బీఐ సేవా కేంద్రం నిర్వాహకుడు రమేష్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను చేసిన మోసాలన్నీ గ్రామంలో తెలియడంతో తీవ్ర మనస్థాపానికి గురై భార్యను బంధువుల ఇంటికి పంపించి ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. సంఘటన స్థలంలో అతను రాసుకున్న ఉత్తరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భార్య ఫిర్యాదు మేరకు సీఐ శ్రీరామ్, ఎస్ఐ శేషగిరి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కరెంట్​ స్థంభాన్ని ఢీకొట్టిన ఆటో....

కరెంట్ స్థంభాన్ని ఆటో ఢీకొని ఇద్దరు వ్యక్తులకు గాయాలైన ఘటన కర్నూలులో చోటు చేసుకుంది. కొత్త బస్టాండ్ వైపు నుంచి వస్తున్న ఆటోడ్రైవర్​కు ఫిట్స్ రావడంతో కరెంటు స్థంబాన్ని ఆటో ఢీ కొట్టింది. ఈప్రమాదంలో ఆటో డ్రైవర్ మహబూబ్ బాష, ప్రయణికుడు అన్వర్ బాషలకు గాయాలు అయ్యాయి. గాయాలైన వారిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పరారైన నిందితుడిని పట్టుకున్న పోలీసులు..

కర్నూలు జిల్లా కారాగారం నుంచి తప్పించుకున్న నిందితుడు చెంచు కుళాయి అలియాస్ నానిని పోలీసులు పట్టుకున్నారు. హత్యాయత్నం కేసులో నిందితుడుగా ఉన్న అతను శుక్రవారం అర్ధరాత్రి జిల్లా కారాగారం నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఓర్వకల్లు మండలంలోని అతని అక్క ఇంటికి వెళ్లిన అతన్ని జైళ్లశాఖ సిబ్బంది పట్టుకున్నారు. ఇతనిపై కర్నూలు తాలుకా పోలీస్​స్టేషన్​లో మరో కేసు నమోదైంది. ఆదివారం జైళ్లశాఖ డీఐజీ ఎంఆర్ రవికిరణ్ ఈ ఉదంతంపై విచారణ చేపట్టారు.

యువతిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి...

శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం ఉంగరాడ మెట్ట వద్ద ఓ యువతిపై గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు ఆదివారం రాత్రి దాడి చేశారు. ఆడవరం గ్రామానికి చెందిన గాయత్రి ద్విచక్రవాహనంపై బంధువుల ఇంటికి వెళ్తుండగా ఉంగరాల మెట్ట వద్ద రోడ్డుకి అడ్డగించి ద్విచక్ర వాహనంపై దాడి చేశారు. ఆ యువతి తప్పించుకునే ప్రయత్నం చేయగా బ్లేడ్లతో దాడి చేసి, అత్యాచారానికి పాల్పడడంతో గట్టిగా కేకలు వేయగా సమీపంలో ఉన్న స్థానికులు సంఘటన స్థలానికి చేరుకోవడంతో నిందితులు పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన యువతిను రాజాం పట్టణం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. కొత్తగా నిర్మిస్తున్న ఇంటి పనులు పర్యవేక్షించి తిరిగి వస్తుండగా ఆదివారం రాత్రి ముగ్గురు యువకులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఎవరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు, ఈ యువతికి ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

Human Skeletons in Canal : కాలువలో రెండు అస్థిపంజరాలు.. ఎవరివి..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.