ETV Bharat / crime

CRIME NEWS: రాష్ట్రంలో పలు ప్రమాదాలు.. నలుగురు మృతి - ఏపీ నేర సమాచారం

CRIME NEWS: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో పలు ప్రమాదాలు, ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో నలుగురు మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. కడప జిల్లా గోపవరం మండలం పి.పి.కుంట జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

రాష్ట్రంలో పలు ప్రమాదాలు
author img

By

Published : May 5, 2022, 2:15 PM IST

Updated : May 5, 2022, 4:38 PM IST

కడప జిల్లా: గోపవరం మండలం పి.పి.కుంట జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. బద్వేల్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుడిని బద్వేల్‌కు చెందిన ప్రకాశ్‌గా గుర్తించారు.

బాపట్ల జిల్లా: మార్టూరులో మైనింగ్‌ అధికారుల తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న గ్రానైట్ ముడి రాయి వాహనాలను స్వాధీనం చేసుకొని, మార్టూరు పీఎస్‌కు తరలించారు.

కర్నూలు జిల్లా: బనగానపల్లె మండలం ఎర్రగుడిలో లక్ష్మీనారాయణ, రాములమ్మ అనే దంపతుల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు వేధిస్తున్నారని ఎస్పీకి లేఖ రాసి, అనంతరం పురుగుల మందు తాగారు. గమనించిన స్థానికులు వారిని బనగానపల్లె ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు.

*ఎమ్మిగనూరు పట్టణంలోని ముగతిపేటలో సురేష్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తల్లిదండ్రులు వివాహానికి వెళ్లి ఇంటికి తిరిగి రాగా.. కుమారుడు శవమై కనిపించాడు. మృతుడి భార్య మహాలక్ష్మి మూడు నెలల క్రితం భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లింది. ఘటనా స్థలాన్ని పట్టణ సీఐ శ్రీనివాస్ నాయక్ వెళ్లి పరిశీలించారు.

చిత్తూరు జిల్లా: పెనుమూరు పీహెచ్‌సీలో విధులు నిర్వహిస్తున్న మాధవి అనే నర్సు ఆత్మహత్యాయత్నం చేసింది. తన ఇంట్లో ఉరేసుకునేందుకు యత్నించగా.. ఆమె కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. పీహెచ్‌సీ వైద్యురాలు తనను వేధింపులకు గురి చేస్తుందని మాధవి లేఖలో పేర్కొంది.

కృష్ణాజిల్లా: గుడివాడ మండలం బొమ్ములూరు గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మూడు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో 120 మినుము బస్తాలు, విలువైన ఆభరణాలు, వస్తువులు కాలి బూడిదయ్యాయి. అలాగే ఒకరికి స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఇతర ఇళ్లకు వ్యాపించకుండా అదుపు చేశారు.

తిరుపతి జిల్లా: పుత్తూరు రైల్వేస్టేషన్‌ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. రైలు నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి ఇద్దరు మృతి చెందారు.

ఇదీ చదవండి: హృదయం లేని జగన్ రెడ్డి పాలనలో.. ఎన్నో దారుణాలు: చంద్రబాబు

Last Updated : May 5, 2022, 4:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.