Robbery in Jewellery Shop: అనంతపురం జిల్లా గుంతకల్లులోని క్రౌన్ టాకీస్ రోడ్డు షాహి మెడికల్ స్టోర్ వద్ద ఉన్న నగల దుకాణంలో శుక్రవారం పట్టపగలే ఓ దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. రహమత్ జువెలరీస్ అనే దుకాణంలో యజమాని సూరజ్ ఖాన్ మంచినీళ్లు తెచ్చుకునేందుకు షాపు వదిలి బయటకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దొంగ.. నగల దుకాణంలో డబ్బులున్న బ్యాగును ఎత్తుకెళ్లాడు. ఇంతలోనే ఆ పక్కనే ఉన్న స్థానికులు కేకలు వేయడంతో బ్యాగ్‌ను వదిలేసి పరారయ్యాడు. దొంగ బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: