చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శేషాచలం అటవీ సమీప ప్రాంతంలోని ఓ వ్యవసాయ బావిలో మహిళ మృతదేహం కలకలం సృష్టించింది. ఏ. రంగంపేట అటవీశాఖ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానస్పదంగా ఇద్దరు వ్యక్తులు తిరుగుతూ ఉండటం గమనించి ప్రశ్నించారు. వెంటనే భయపడిన సదరు వ్యక్తులు బాషా, మహేశ్.. మల్లేశ్వరి అనే మహిళను బావిలో పడేసి వస్తున్నట్లు అటవీ సిబ్బందికి తెలిపారు.
వెంటనే... అటవీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బావిలో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఆమెను హత్య చేయడానికి గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న చంద్రగిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
DGP Twitter: డీజీపీ పేరుతో నకిలీ ఖాతా కేసు.. దర్యాప్తులో సహకరించని ట్విటర్!