DIED: అనంతపురం జిల్లాలో ఆటో బోల్తా పడిన ఘటనలో గాయపడి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అఖిల అనే విద్యార్థిని మృతి చెందింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరు విద్యార్థినిలు, ఆటో డ్రైవర్ అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదీ జరిగింది..
అనంతపురం జిల్లా విడపనకల్ వద్ద 10వ తరగతి విద్యార్థినిలు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడింది. ఏపీ మోడల్ పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు రాసి హవలిగి గ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ముగ్గురు విద్యార్థినిలకు, ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను విడపనకల్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా.. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురం ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: నాసిరకం మద్యం కప్పిపుచ్చడానికి.. ప్రభుత్వం ప్రయత్నాలు: ప్రత్తిపాటి