ETV Bharat / crime

Ganja Smuggling: చాక్లెట్స్‌, బిస్కెట్‌, టీ పొడి.. కొత్తరూపులో గంజాయి - Cannabis illegal transportation in telangana

తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతున్న మత్తు పదార్థం గంజాయి. ఓ వైపు అధికారులు దాడులతో వందలాది కిలోలను స్వాధీనం చేసుకుంటుంటే.. మరో వైపు స్మగ్లర్లు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకునేందుకు చాక్లెట్స్‌, బిస్కెట్‌, టీ పొడి రూపాల్లోకి మార్చుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 14 వందల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

telugu-state-governments-worried-about-ganja-smuggling
చాక్లెట్స్‌, బిస్కెట్‌, టీ పొడి.. కొత్తరూపు సంతరించుకున్న గంజాయి
author img

By

Published : Nov 2, 2021, 8:50 AM IST

మాదక ద్రవ్యాల రవాణాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండటంతో స్మగ్లర్లు సరికొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. పోలీసుల కన్నుగప్పి గంజాయిని చేరవేసేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా చాక్లెట్ల రూపంలో గంజాయిని విక్రయిస్తున్నారు. నాలుగేళ్ల కిందట హైదరాబాద్ నగరానికి చెందిన ఒక వైద్యుడు చాక్లెట్ల రూపంలో గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డాడు. మాసబ్‌ ట్యాంక్‌ వద్ద లిక్కర్‌ చాక్లెట్స్‌ను పాఠశాల విద్యార్థులకు అలవాటు చేసిన కొందరిని ఎక్సైజ్‌ శాఖ అరెస్ట్‌ చేసింది. కరోనా కారణంగా తనిఖీలు నిలిపివేయటంతో అక్రమార్కులు మరింత చెలరేగిపోయారు. సామాజిక మాధ్యమాలు వేదికలుగా మారటం కలవరపాటుకు గురిచేసింది.

కూలీలు, విద్యార్థులే లక్ష్యం..

కూలీలు, విద్యార్థులే లక్ష్యంగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి. పగలంతా కష్టపడిన కూలీలు సాయంత్రం వేళ మద్యం సేవిస్తుంటారు. మరింత కిక్‌ కోసం గంజాయికి దగ్గరవుతున్నారు. విందు, వినోద కార్యక్రమాల్లో విద్యార్థులు దీన్ని రుచిచూస్తున్నారు. ఇంటా, బయటా అనుమానం రాకుండా తేలికగా దాచుకునేందుకు, వాడేందుకు గంజాయి చాక్లెట్స్‌ అనుకూలంగా మారాయి. ఎండు గంజాయిని మెత్తగా పట్టి చాక్లెట్స్‌గా తయారు చేస్తున్నారు. కమీషన్‌పై ఆశతో పాన్‌ దుకాణదారులు వీటిని పెద్ద ఎత్తున నిల్వ చేస్తున్నారు. మరింత మత్తులోకి చేరేందుకు గంజాయి ఆకుల నుంచి తీసిన నూనెలో రసాయనాలను చేర్చి హాసిష్​ ఆయిల్‌గా విక్రయిస్తున్నారు. గంజాయి నూనె లీటరు ధర సుమారు లక్ష నుంచి లక్షన్నర వరకూ ఉంటుందని అంచనా. దీన్ని చిన్న అట్టపెట్టెలు, సీసాల్లో 10, 20 మిల్లీ లీటర్లుగా మార్చి ఆన్‌లైన్‌ ద్వారా చేరవేస్తున్నారు. కళాశాల విద్యార్థులే లక్ష్యంగా వీటిని ఆన్‌లైన్‌ ద్వారా విక్రయిస్తున్నారు.

అమాంతం పెరిగిన గంజాయి ధర..

బంజారాహిల్స్‌, మెహిదీపట్నం, అబిడ్స్‌, మాసబ్‌ ట్యాంక్‌, సికింద్రాబాద్‌, నానక్‌రామ్‌ గూడ, శంషాబాద్‌ తదితర ప్రాంతాల్లోని పలు పాన్‌ దుకాణాల్లో ఒక్కో చాక్లెట్‌ 60 నుంచి 70 వరకూ విక్రయిస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి ఒకరు తెలిపారు. వీటిని అధిక శాతం ఒడిశా, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కూలీలు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. రైలు, బస్సులు, కొరియర్‌ సంస్థల ద్వారా ఒడిశా నుంచి నగరంలోకి ఈ చాక్లెట్స్‌ చేరుతున్నట్లు ఇటీవల పట్టుబడిన ఓ నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధికారుల తనిఖీలతో రవాణాకు అడ్డుకట్ట పడటంతో గంజాయి ధరను అమాంతం పెంచేశారు.

స్నేహితుల ప్రోత్సాహంతో..

స్నేహితుల ప్రోత్సాహంతో దగ్గరైన మత్తుపదార్థాలకు క్రమంగా బానిసలుగా మార్చుతున్నాయి. జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. నగరవ్యాప్తంగా పోలీసులు, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు చేపడుతున్న దాడులతో మాదకద్రవ్యాల వినియోగం భారీస్థాయికి చేరినట్లు బయటపడుతోంది. పాఠశాల విద్యార్థి నుంచి కార్పొరేట్‌ సంస్థలో పనిచేసే ఉద్యోగుల వరకూ గంజాయి మైకంలో మునిగి తేలుతున్నారు. ఇప్పటి వరకూ సుమారు 5 నుంచి 6 వేల మంది వరకూ గంజాయి వాడుతున్న వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. రెండు వందల మందిని అరెస్ట్‌ చేశారు.

ఇదీచూడండి: Ganja Smuggling: గంజాయి దారులు మూసేలా .. పోలీసు, ఎక్సైజ్‌ శాఖల వ్యూహం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.