ETV Bharat / crime

SUICIDE: స్మార్ట్ ఫోన్​ కొనివ్వలేదని.. విద్యార్థిని ఆత్మహత్య - ఫోన్​ కొనివ్వలేదని ఆత్మహత్య

స్మార్ట్​ ఫోన్​ కొనివ్వలేదని విద్యార్థిని క్షణికావేశంలో ప్రాణం తీసుకుంది. తల్లిదండ్రుల ఆర్థిక స్థోమతను అర్థం చేసుకోకుండా బలవన్మరణానికి పాల్పడింది. ఆన్​లైన్​ క్లాసుల కోసం ఆరాటపడి.. కన్నవారికి తీరని శోకం మిగిల్చింది.

student suicide
student suicide
author img

By

Published : Jul 28, 2021, 1:04 PM IST

తల్లిదండ్రులు ఫోన్​ కొనివ్వలేదని ఓ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని మహబూబాబాద్​ జిల్లాలో చోటు చేసుకుంది. కొత్తగూడ మండలం ఎదుల్లపల్లి గ్రామానికి చెందిన కూస సంపత్​కు ఇద్దరు కుమార్తెలు. వారిలో చిన్న కుమార్తె కూస త్రిష.. ఇటీవల పదో తరగతి పాస్​ అయింది.

ఆన్​లైన్​ క్లాసులు ఉన్నాయని.. సెల్​ఫోన్​ కొనివ్వాలని త్రిష తండ్రిని కోరింది. ఇప్పుడు డబ్బులు లేవు.. కొద్దిరోజులు ఆగాలని సంపత్​ చెప్పగా తీవ్ర మనస్థాపానికి గురైంది. తండ్రిని అర్థం చేసుకోకుండా.. క్షణికావేశంలో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను నర్సంపేట ప్రాంతీయ హాస్పిటల్​కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ త్రిష మృతి చెందింది. తండ్రి ఇచ్చిన సమాచారం మేరకు కొత్తగూడ ఎస్సై సురేష్ కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

ఇదీ చూడండి:

She Teams: మహిళలను యువకులే ఎక్కువ వేధిస్తున్నారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.