ETV Bharat / crime

Fraud: చీటీ పేరుతో మహిళ మోసం.. రూ.5.6 కోట్ల మేర కుచ్చుటోపీ

చిన్నా చితక పనులు చేసుకుంటూ కొందరూ... ఉద్యోగాలు చేసుకుంటూ కొందరూ ఓ మహిళ వద్ద చీటీలు వేశారు. చాలా ఏళ్లుగా డబ్బులు సరిగ్గానే చెల్లించిన ఆమె ప్రస్తుతం అందరినీ నట్టేట ముంచింది. సుమారు రూ.5.60 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టి... డబ్బులు కావాలని వెళ్తున్న వారికి రేపు మాపంటూ కాలం గడిపేస్తోంది.

sopirala-women-cheated-so-many-peiople-name-of-receipt-scams
చీటీ పేరుతో మహిళ మోసం.. రూ.5.6 కోట్ల మేర కుచ్చుటోపీ
author img

By

Published : Sep 5, 2021, 12:53 PM IST

చీటీ పాటల పేరుతో ఓ మహిళ పలువురిని నట్టేట ముంచారు. సుమారు రూ.5.60 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం జిల్లా చినగంజాం మండలం సోపిరాలకు చెందిన పోలకం ఝాన్సీలక్ష్మి, వెంకటస్వామి దంపతులు. వెంకటస్వామి మిలటరీలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. అనంతరం అగ్నిమాపక శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించి కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. ఝాన్సీలక్ష్మి సుమారు 25 ఏళ్లుగా సోపిరాలలో ఉంటూ చీటీ పాటలు నిర్వహిస్తూ అందరికీ నమ్మకం కలిగించారు.

పట్టణాల్లో విలువైన భవనాలు, స్థలాల కొనుగోలు..

చీటీ పాటలు వేస్తున్న వారితో పాటు ఇతరుల నుంచి రూ. లక్ష, రూ.2 లక్షలు, రూ. 5 లక్షలు, రూ. 10 లక్షల చొప్పున అప్పుగా తీసుకున్నారు. ఇలా సుమారు రూ.5.60 కోట్ల వరకు పాటదారులు, అప్పులిచ్చిన వారికి చెల్లించాల్సి ఉంది. కొన్నినెలలుగా బాకీలు చెల్లించడం లేదు. ఈ క్రమంలోనే తాను ఉండే ఇంటిని ఝాన్సీలక్ష్మి ఇటీవల విక్రయించారు. అదే సమయంలో హైదరాబాద్, చీరాల తదితర పట్టణాల్లో విలువైన భవనాలు, ఇళ్ల స్థలాలను కొనుగోలు చేశారు. అయితే చీటీ పాటలు పాడిన వారికి డబ్బులు చెల్లించకపోవడం, అప్పులు తీసుకున్నవారికి ఇవ్వకుండా తిప్పుకొంటున్నారు.

పోలీసులను ఆశ్రయించిన బాధితులు..

బాధితులందరూ గట్టిగా నిలదీయడంతో కుటుంబ సభ్యులు, బంధువులకు ఇచ్చినట్టు చెప్పారు. దీంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ సుమారు యాభై మంది బాధితులు చినగంజాం పోలీసులను శనివారం ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇంకొల్లు సీఐ సుబ్బారావు, ఎస్సై పి.అంకమ్మరావు తెలిపారు.

ఇదీ చూడండి: DWAKRA WOMEN MONEY SCAM: డబ్బులు కొట్టేశాం.. వాటాలు పంచుకున్నాం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.