ఆగి ఉన్న లారీని కర్నాటకకు (కేఎస్ ఆర్టీసీ) చెందిన ఐరావతం బస్సు వెనుకనుంచి ఢీ కొట్టింది. ఈ ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో బెంగళూరుకు చెందిన ఏడుగురికి గాయాలవ్వగా ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108 వాహనంలో ఎమ్మిగనూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద నిలిపిఉన్న లారీని శనివారం తెల్లవారుజామున కర్నాటకలోని మైసూరు నుంచి ప్రయాణికులతో వస్తున్న బస్సు వెనుక నుంచి వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న మైసూర్‌కు చెందిన వెంకటేశ్, సోమశేఖర్, చరిత, సాయినాథ్‌లు సహా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి దర్శనార్థం వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదివింది: ఆదిత్య దాడి చేయమంటేనే చేశాము: నిందితులు