Road Accident Sri Sathyasai district: ) శ్రీ సత్య సాయి జిల్లా కనగానపల్లి మండలం పర్వత దేవరపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ దంపతులు రమ్య గోపీనాథ్‌లు...తమ పిల్లలు సాహిత్, హాసినితో పాటు బంధువుతో కలిసి బెంగళూరు నుంచి కారులో హైదరాబాద్ వస్తున్నారు. కారు వేగంగా డివైడర్‌ను ఢీకొనడంతో....దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. వారి బంధువు తారకేశ్వరి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రమాదంలో గాయపడిన పిల్లలు సాహిత్ , హాసినికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు
ఇవీ చదవండి: