ETV Bharat / crime

Maoist Haribhushan: మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ మృతి!

hari bhushan maoist
hari bhushan maoist
author img

By

Published : Jun 22, 2021, 3:05 PM IST

Updated : Jun 22, 2021, 4:09 PM IST

15:00 June 22

సాయంత్రం పోలీసులు ప్రకటించే అవకాశం

మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ మృతి చెందినట్లు తెలుస్తోంది. అనారోగ్యంతో హరిభూషణ్ మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో యాపా నారాయణ అలియాస్​ హరిభూషణ్​ సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. హరిభూషణ్​ మృతిపై పోలీసులు అధికారికంగా ప్రకటన చేయలేదు. సాయంత్రం పోలీసులు ప్రకటన చేసే అవకాశం ఉంది.  

   తెలంగాణలోని  మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని మడగూడెెం గ్రామానికి చెందిన హరిభూషణ్​ 1995లో పీపుల్స్​వార్​ గెరిల్లాలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ తెలంగాణ కమిటీ కార్యదర్శిగా కీలకపాత్ర పోషిస్తున్నాడు. తెలంగాణ-చత్తీసగఢ్​ సరిహద్దుల్లో జరిగిన అనేక ఆపరేషన్స్​లో కీలక పాత్ర పోషించాడు. ఆయన కరోనాతో పోరాడి మృతి చెందినట్లు సమాచారం. ఏజెన్సీలో మరికొందరు మావోలు కరోనా బారినపడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వినోద్, రాజేశ్, ఇడుమా కూడా కరోనా బారినపడినట్లు పోలీసులు భావిస్తున్నారు.  

ఇదీ చదవండి

Vamshadhara: సుదీర్ఘకాలం తర్వాత సమస్యకు పరిష్కారం: జగన్

Last Updated : Jun 22, 2021, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.