SEB Commissioner Vineet Brijlal: రాష్ట్రంలో రోజుకు సగటున 633 కిలోల గంజాయి పట్టుబడుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) అధికారులు 2,31,174 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ రూ.231.17 కోట్లు. ఈ లెక్కన నెలకు దాదాపు రూ.19.25 కోట్ల విలువైన గంజాయి పట్టుబడుతోంది. ఎస్‌ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ బుధవారం వార్షిక నేర నివేదిక-2021 విడుదల చేశారు.
‘ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఈ ఏడాది అక్టోబరు నుంచి బుధవారం వరకూ 299 గ్రామాల పరిధిలో 7,375.10 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేశాం. దీని మార్కెట్ విలువ రూ.9,034.49 కోట్లు ఉంటుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో గంజాయి సరఫరా బాగా తగ్గిపోతుంది’ అని వివరించారు. మద్యం, ఇసుక అక్రమ రవాణా, నాటుసారా తయారీ, మాదకద్రవ్యాల సరఫరా, వినియోగానికి సంబంధించి ఈ ఏడాదిలో మొత్తం 1,05,689 కేసులు నమోదు చేసి.. 1,46,217 మందిని అరెస్టు చేశామని తెలిపారు.
ఇదీ చదవండి: