తెలంగాణ: నిజామాబాద్‌లో రౌడీషీటర్ అనుచరుల హల్చల్ - rowdy sheeter followers attack on people
తెలంగాణలోని నిజామాబాద్‌లో ఓ రౌడీషీటర్ అనుచరులు దారుణానికి ఒడికట్టారు. ఆటోనగర్‌లో ఉన్న రజాక్ హోటల్ వద్ద ఇర్ఫాన్‌ఖాన్, ఇలియస్ అనే వ్యక్తులపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. వారికి గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇబ్బు చావూస్ అనుచరులు దాడికి పాల్పడ్డారని ఆరో టౌన్ ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.