గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం గ్రామంలో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేనిది చూసి ఏకంగా బీరువానే పొలాల్లోకి ఎత్తుకెళ్లారు దొంగలు. రూ.10 వేల నగదు, వెండి సామాన్లు అపహరించారు. చీరలు, ఇతర పత్రాలు పొలంలోనే పడేశారు.
పని కోసం వెళ్తే.. ఇల్లు గుల్ల..
గ్రామానికి చెందిన కేతినేని హరిబాబు కుటుంబం నాలుగు రోజుల క్రితం వ్యవసాయ పనుల కోసం కర్ణాటక రాష్ట్రం రాయచూర్కి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన దొంగలు తలుపు గడియ విరగ్గొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. పరుపు, దిండ్లు ఉపయోగించి శబ్దం రాకుండా ఆ ఇంటి వెనుక ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లారు. చిలకలూరిపేట రూరల్ ఎస్సై భాస్కర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: