Road Accidents at hanumanpuram:కూలీలతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడటంతో.... అందులో ప్రయాణిస్తున్న 12 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అనంతపురం జిల్లా కనేకల్ మండలం ఎన్.హనుమాపురం గ్రామ శివారులోని వంక వద్ద రాగానే ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. కనేకల్ మండలం సొల్లాపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు 15 మంది ఉదయం.... ఆటోలో ఉరవకొండ మండలం నెరిమెట్ల గ్రామంలోని పంటపొలాల్లో పనికి వెళ్లారు.
సాయంత్రం పనులు ముగించుకొని తమ గ్రామానికి తిరిగి వస్తుండగా... ఎన్.హనుమాపురం గ్రామ సమీపంలోని ఆర్అండ్బీ ప్రధాన రహదారిలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో క్షతగాత్రులను ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వ వైద్యుల సూచనల మేరకు అనంతపురం ప్రధాన వైద్యశాలకు తరలించారు. ఆటో అతివేగంతో పాటు... అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు క్షతగాత్రులు తెలిపారు . ఈ ప్రమాదంపై కనేకల్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: కనిగిరిలో దారుణం.. హత్య చేసి.. పూడ్చి పెట్టి..
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!