ETV Bharat / crime

ప్రైవేట్​ స్కూల్​ టీచర్​ కర్కశత్వం.. హోం వర్క్​ బుక్​ తీసుకురాలేదని.. - ap viral news

Teacher Beat Student : ఓ విద్యార్థిపై ప్రైవేట్​ స్కూల్​ టీచర్​ కర్కశంగా వ్యవహరించింది. హోంవర్క్​ బుక్​ తీసుకురాలేదనే నెపంతో బెత్తంతో కొట్టింది. దీంతో బాలుడి ఎడమ కన్నుకి దెబ్బతగలడంతో తీవ్ర రక్తసావం అయ్యింది. అయినా కనికరించని ఆ టీచర్​.. సాయంత్రం వరకు పిల్లాడిని స్కూల్​లోనే ఉంచింది. బాలుడిని ఇంటికి తీసుకెళ్లడానికి పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు.. బాలుడి కన్నుకు గాయం కావడాన్నిగుర్తించారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.

Teacher Beat Student
Teacher Beat Student
author img

By

Published : Nov 10, 2022, 12:36 PM IST

Updated : Nov 10, 2022, 12:48 PM IST

Teacher Beat Student In Nellore : నెల్లూరు జిల్లా నవాబ్​పేటలోని రవీంద్రభారతి స్కూల్​లో పనిచేస్తున్న ఓ టీచర్.. విద్యార్థిపై కర్కశంగా వ్యవహరించింది. హోం వర్క్​ బుక్​ తీసుకురాలేదని నాలుగో తరగతి చదువుతున్న ఆకాంక్ష్​ను బెత్తంతో కొట్టింది. దీంతో బాలుడి ఎడమ కన్నుకు గాయం అయింది. రక్తం కారుతున్నా కనికరించని టీచర్​ చికిత్స చేయకుండా.. సాయంత్రం వరకూ స్కూల్లోనే ఉంచారు. బాలుడిని ఇంటికి తీసుకురావడానికి వెళ్లిన తల్లిదండ్రులకు ఆకాంక్ష్​ కంటి నుంచి రక్తం కారడం చూసి ఆందోళన చెందారు.

ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే.. వారు ఏ విధమైన సమాధానం ఇవ్వలేదు. గాయపడిన బాలుడిని తల్లి ఆసుపత్రికి తీసుకుపోయారు. కంటి లోపల తీవ్ర గాయం, రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు తెలిపారని ఆకాంక్ష్​ తల్లి ఆశా తెలిపారు. అప్పటికీ కూడా రవీంద్ర భారతి స్కూల్ యాజమాన్యం స్పందించలేదని వాపోయారు. అయితే ఈ ఘటనపై నెల్లూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తమది పేద కుటుంబం అని తమ బిడ్డకు కన్ను బాగు చేయించాలని ఆ తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 10, 2022, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.