ETV Bharat / crime

ఎత్తు ఎక్కువ చూపేందుకు పోలీసు అభ్యర్థి మాస్టర్​ ప్లాన్.. చివరికి దొరికిపోయిందిలా! - Police Jobs

Cheating in police events: పోలీసు జాబ్​ కోసం ఎందరో యువత కళ్లు కాయలు కాస్తున్నట్లు ఎదురు చూస్తున్నారు. ఈ పోటీ ప్రపంచంలో ఎంతో మందిని నెగ్గుకుంటూ ప్రాథమిక పరీక్షలో రాణిస్తూ.. దేహాదారుడ్య పరీక్షలు కోసం సిద్ధమవుతున్నారు. అన్నిటీలో రాణిస్తున్నా.. కొందరు యువతుకు వారి ఎత్తు శాపంగా మారుతోంది. పోలీసు యూనిఫాం వేసుకొని లాఠీ పడదాం అనే వారి కల కలగానే మిగిలిపోతుంది. ఇందులో కొందరికి కొన్ని మి.మీ , సెం.మీ ఎత్తు సరిపోవకపోవడం వారు అడ్డదారులు వెతుకుతున్నారు. అలానే ప్రయత్నం చేసి మహబూబ్​నగర్​ పోలీసు అధికారులకు దొరికిపోయారు ఓ మహిళ అభ్యర్థి.

police candidate
police candidate
author img

By

Published : Dec 14, 2022, 10:48 PM IST

Cheating in police events: పోలీసు ఉద్యోగానికి అర్హత సాధించేందుకు ఓ మహిళా అభ్యర్థి.. తన ఎత్తును పెంచి చూపేందుకు చేసిన ప్రయత్నాల్ని తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లా పోలీసులు భగ్నం చేశారు. మహబూబ్‌నగర్‌ స్టేడియం గ్రౌండ్‌లో దేహదారుఢ్య పరీక్షలు జరుగుతున్నాయి. ఎత్తు కొలిచే ప్రక్రియలో భాగంగా ఓ మహిళ అభ్యర్థి.. ఎలక్ట్రానిక్ యంత్రం ముందు నిలబడ్డారు. కానీ ఆమెను పరికరంలోని సెన్సార్లు గుర్తించలేదు. అనుమానం వచ్చిన మహిళా అధికారి.. అభ్యర్థి తలపై ప్రత్యేకంగా పరిశీలించారు.

ఎత్తు ఎక్కువ చూపేందుకు పోలీసు అభ్యర్థి మాస్టర్​ ప్లాన్

సదరు అభ్యర్థి జుట్టు లోపల ఎమ్​-సీల్ మైనం అతికించుకున్నట్లుగా గుర్తించారు. తలపై ఉబ్బెత్తుగా మైనం పెట్టుకుని.. తన ఎత్తు ఎక్కువ చూపేందుకు ప్రయత్నించింది ఎత్తు ఎక్కువ చూపేందుకు ప్రయత్నించిన మహిళ అభ్యర్థిని ఎస్పీ వెంకటేశ్వర్లు అనర్హురాలిగా ప్రకటించారు. దేహదారుఢ్య పరీక్షల్లో ఆధునిక సాంకేతికత వినియోగిస్తున్నామని.. సీసీ కెమెరాలు, పోలీసు సిబ్బంది నిశితంగా పరిశీలిస్తారని తెలిపారు. అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్పీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.