ETV Bharat / crime

Police assault on woman: 'ఉద్యోగం అడిగితే..అధికార పార్టీ నేతలు కొట్టించారు' - వీణవంకలో యువతిపై దాడి

తెలంగాణలోని కరీంనగర్​ జిల్లా వీణవంకలో తనపై పోలీసులు దాడికి దిగినట్లు ఓ యువతి ఆరోపించారు. నిరుద్యోగ సమస్యలపై మాట్లాడటానికి వెళ్తే... పోలీసులతో కొట్టించారని అన్నారు.

'ఉద్యోగం అడిగితే..అధికార పార్టీ నేతలు కొట్టించారు'

author img

By

Published : Oct 18, 2021, 3:24 PM IST

తెలంగాణలోని కరీంనగర్​ జిల్లా వీణవంక మండలంలో పోలీసులు కేసీఆర్​కు తొత్తులుగా మారారని ఓ యువతి ఆరోపించారు. తాను వీణవంక మండలంలో తెరాస పార్టీ సమావేశానికి వెళ్తే.. పోలీసులు తనపై దాడికి దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నిరుద్యోగ సమస్యలపై మాట్లాడటానికి వెళ్తే.. తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారన్నారు. భాజపా తనకు రూ.10 లక్షలు ఇచ్చినట్లు ఆరోపించారని పేర్కొన్నారు.

తన దారిన తాను వెళ్తుంటే.. పోలీసులు తనపై దాడికి దిగారని ఆవేదన చెందారు. పోలీసులు ఇష్టం వచ్చినట్లు కొట్టారని ఆ యువతి ఆరోపించారు. మెడలో ఛైన్​ లాగేసుకున్నారని కన్నీరు పెట్టుకున్నారు. నిరుద్యోగ బాధలు ఎవరికి అర్ధం కావడం లేదని విలపించారు.

ఉద్యోగం అడిగితే..అధికార పార్టీ నేతలు కొట్టించారు

ఈరోజు వీణవంక మండలంలో తెరాస పార్టీ సమావేశం జరిగింది. నోటిఫికేషన్లు వేయండని రెండు నిమిషాలు మాట్లాడుదాం అనుకున్నా.. తెరాస కార్యకర్త వచ్చి.. భాజపా.. నాకు రూ.10 లక్షలు ఇచ్చింది అని అన్నారు. నాకు కోపం వచ్చింది.. సరేలే అని నేను వెళ్తుంటే.. పోలీసులు నన్ను ఇష్టం వచ్చినట్లు కొట్టారు. చేతులు, కాళ్లు లాగేసి.. ఆగమాగం చేశారు. చైన్ లాగేసుకున్నారు. పోలీసులు కేసీఆర్​కు తొత్తులుగా మారారు. - బాధితురాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.