Illegal liquor was seized by the police: చిత్తూరు జిల్లా గంగవరం మండల కేంద్రంలో పోలీసుల వాహన తనిఖీల్లో భాగంగా.. కర్ణాటక నుంచి అక్రమ మద్యంతో వస్తున్న కారు మరో ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు చెన్నై రహదారిపై పోలీసుల విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో కర్ణాటక నుంచి అనుమానాస్పదంగా ద్విచక్రవాహనం, కారు వస్తుండగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో వాహనాల్లోని ఒకరు పరారు కాగా మిగిలిన ఐదుగుర్నిఅదుపులోనికి తీసుకున్నారు . స్వాధీనం చేసుకున్న మద్యంతో పాటు సీజ్ చేసిన వాహనాల విలువ 7లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ సుధాకర్ రెడ్డి అభినందించారు
ఇవీ చదవండి: