అమాయకుడైన తన భర్తను పోలీసులు అన్యాయంగా గంజాయి కేసులో అరెస్ట్ చేశారంటూ... పాడేరుకు చెందిన ఓ మహిళ వాపోతోంది. ఈనెల 13న విశాఖ జిల్లా చీడికాడ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా....ఓ ద్విచక్రవాహన దారుడు బండి వదిలి పరారయ్యాడు. ఆ బండి నెంబర్‌ను బట్టి పాడేరులో కాకా హోటల్ నడిపే శివ వాహనంగా పోలీసులు గుర్తించారు. బండి రెండేళ్ల కిందటే వేరే వ్యక్తికి అమ్మేశానని చెప్పినప్పటికీ... సంతకం పెట్టాలని స్టేషన్‌కు తీసుకెళ్లారని బాధితుడి భార్య వెల్లడించింది. బండి కొనుగోలు చేసిన రఘునాధ్ ఇంటికి వెళ్లగా.... పరారీలో ఉన్నాడని తెలిపింది. గంజాయి కేసులో పరారైన బండి కొన్న వ్యక్తి దొరకగానే పంపిస్తామని చెప్పిన పోలీసులు... ఇప్పుడు నా భర్త మీద కేసు పెట్టి కటకటాల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఇదీ చూడండి: విశాఖలో విషాదం.. అనారోగ్యంతో భార్య మృతి, రోదిస్తూ గుండెపోటుతో భర్త మృతి