ETV Bharat / crime

పోషించే స్థోమత లేదని.. శిశువును అమ్మిన తల్లిదండ్రులు - ts news

Parents Sold Infant Boy: అమ్మ ప్రేమను అందుకోలేని దీనస్థితి ఆ చిన్నారిది. తండ్రి లాలనకూ నోచుకోని దుస్థితి ఆ శిశువుది. తల్లిదండ్రుల సంరక్షణలో హాయిగా ఎదగాల్సిన ఆ పసివాడిపై ఆర్థిక ఇబ్బందుల రూపంలో విధి పగబట్టింది. మగశిశువును భారంగా భావించిన తల్లిదండ్రులు ఆ చిన్నారిని రూ.20వేలకు విక్రయించారు. ఆర్థిక ఇబ్బందులు ఎంతటి ఘాతుకానికైనా దారి తీస్తుందన్నడానికి నిదర్శనంగా నిలుస్తున్న ఈ ఘటన తెలంగాణలోని నిజామాబాద్​ జిల్లాలో జరిగింది.

పోషించే స్థోమత లేదని శిశువును అమ్మిన తల్లిదండ్రులు

author img

By

Published : Mar 27, 2022, 9:46 PM IST

Parents Sold Infant Boy: కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే పోషించే స్థోమత లేక కన్నబిడ్డను విక్రయించిన దారుణ ఘటన తెలంగాణలోని నిజామాబాద్​ జిల్లాలో చోటుచేసుకుంది. బాలుడు పుట్టిన 24 గంటలు గడవక ముందే 20 వేలకు విక్రయించారు. సిద్దిపేట జిల్లాకు చెందిన భీమవ్వ, కొమురయ్య దంపతులు... డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌ గ్రామ శివారులోని మహాలక్ష్మి నగర్​లో గుడారం వేసుకుని సంచార జీవనం గడుపుతున్నారు. నిండుగర్భిణీ అయిన భీమవ్వకు పురిటినొప్పులు రావటంతో డిచ్​పల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె మగ శిశువుకు జన్మనివ్వగా వైద్యులు డిశ్చార్జి చేశారు.

పుట్టిన కొద్దిసేపటికే నవజాత శిశువును ఇతరులకు 20 వేలకు విక్రయించారు. విషయం తెలుసుకున్న ఆరోగ్య సిబ్బంది వారిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. బిడ్డను పోషించే స్థోమత లేక తమ బంధువులకు ఇచ్చామని వారు చెప్పినట్లు అధికారులు తెలిపారు. శిశువును నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: Bus accident: నిశ్చితార్థానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. చిన్నారితో సహా ఎనిమిది మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.