ETV Bharat / crime

Lottery: సిక్కోలు గడ్డపై నయా మోసం.. జీవితాలను ముంచేస్తున్న "లాటరీ వల" - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

Lottery: అవి పేరుకు బడ్డీకొట్లు.. కానీ నెలకు లావాదేవీలు కోట్లలోనే..! లాభాల్లో వాళ్లు నిమిత్తమాత్రులే.! అసలు కథ వేరే ఉంటుంది.! నడిచేవాళ్లు, నడిపించే వాళ్లు ఎక్కడో ఉంటారు. లక్ష్మీదేవి తలుపు తడుతుందేమోనని ఆశపడే అమాయకులకు.. ఎర వేస్తారు. వేరే రాష్ట్రం నుంచి లాటరీ టికెట్లు తెచ్చి.. వాటికి నకిలీ టికెట్లు జోడించి.. అంటగడతారు. శ్రీకాకుళంలో ఎన్నాళ్లుగానో సాగుతున్న ఈ లాటరీ దందా... "ఈనాడు-ఈటీవీ-ఈటీవీ భారత్" నిఘాలో బట్టబయలైంది.

fake lotteries in Srikakulam
సిక్కోలు గడ్డపై నయామోసం.. జీవితాలను ముంచేస్తున్న లాటరీ
author img

By

Published : Apr 15, 2022, 12:32 PM IST

సిక్కోలు గడ్డపై నయామోసం.. జీవితాలను ముంచేస్తున్న లాటరీ

Lottery: సిక్కోలు గడ్డపై నయామోసం వెలుగులోకి వచ్చింది.. ఇప్పటివరకూ పక్క రాష్ట్రాలకే పరిమితమైన ‘లాటరీ టిక్కెట్ల’ సంస్కృతి శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి పాకింది.. అంతేగాక నకిలీ టిక్కెట్ల పేరుతో విక్రయదారులు అమాయక ప్రజలను మోసగిస్తూ దోచుకుంటున్నారు. శ్రీకాకుళం నగరంలోని ఏడురోడ్లు, కృష్ణా పార్క్‌, డే అండ్‌నైట్‌ కూడళ్లలో పాన్‌షాప్‌ల ముసుగులో రూ.కోట్ల వ్యాపారం యథేచ్ఛగా సాగిపోతున్నా ఎవరికీ తెలియకపోవడం గమనార్హం. పోలీసు ఉన్నతాధికారులకు వెళ్లిన ఫిర్యాదు నేపథ్యంలో స్థానిక పోలీసులకు చెప్పకుండా వేర్వేరుచోట్ల నుంచి వచ్చిన అధికారులు గురువారం సాయంత్రం ఆకస్మిక దాడులు చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తొమ్మిది దుకాణాలపై దాడులు చేసి 16 మంది దుకాణదారులతో పాటు, టిక్కెట్లు కొనుగోలు చేసినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జరుగుతోంది ఇది..: అరుణాచలప్రదేశ్‌ రాష్ట్రం పేరుతో నకిలీ లాటరీ టిక్కెట్లు తయారు చేసి ఆన్‌లైన్‌ ద్వారా విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. అరుణాచల లక్ష్మి, అరుణాచల డైమండ్‌, సిక్కిం డేటా, సిక్కిం సూపర్‌ పేరుతో రూ.50 నుంచి రూ.150 ధరలతో మార్కెట్లో నకిలీ టిక్కెట్లు అమ్ముతున్నారు. వీటి ధర ఆధారంగా విజేతలకు రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకూ పలుకుతాయని ఆశ చూపుతున్నారు.

శ్రీకాకుళంలో ఏజెంట్లు...: తెనాలికి చెందిన ఓ వ్యక్తి దీనికి కీలక సూత్రధారిగా ఉన్నట్లు సమాచారం. ఇతని కనుసన్నల్లో జిల్లా కేంద్రంలో 12 మంది టిక్కెట్లు అమ్మే ప్రధాన ఏజెంట్లు ఉన్నారు. నగరానికి చెందిన ఒకరి వద్ద 25 మంది సబ్‌ ఏజెంట్లు కూడా పని చేస్తున్నారు. రోజుకు ఒక్కొక్కరు దాదాపు రూ.30 వేల వరకూ లాటరీ టిక్కెట్లు అమ్ముతారు. అంటే రోజుకు సుమారు రూ.7.50 లక్షల వరకు వ్యాపారం చేస్తున్నారని మాట. మరో ఆరుగురు ఏజెంట్లు సుమారు రూ.11 లక్షల వరకు అమ్ముతున్నట్లు సమాచారం. మిగిలిన వారంతా కలిపి రోజుకు దాదాపు రూ.50 లక్షలకు పైగా వ్యాపారం సాగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

ఎలా సాగుతుందంటే..: ఒక వ్యక్తి రెండు టిక్కెట్లు కొనుగోలు చేస్తారు. ఉదాహరణకు ఆయన టిక్కెట్‌ నంబరు 534550, 51 అనుకుంటే, డ్రా తీసినపుడు 534549, 52 నంబర్లను విజేతలుగా ప్రకటిస్తారు. అయ్యో దగ్గరకొచ్చి ఒక్క నంబరులో డబ్బులు పోయాయని అనుకుంటారు. కానీ నిజానికి 534550, 51 నంబర్లు డ్రాలో వేయరు. ఇలా కొంతకాలం ఆశచూపుతూ వ్యాపారం పెంచుకుంటూపోతారు. వ్యసనానికి బానిసైన వ్యక్తులు రూ.లక్షల్లో అప్పులపాలవుతున్నారు. మొదట్లో రూ.10 వేలు పోగొట్టుకున్న వ్యక్తుల్లో మళ్లీ ఆశలు పెంచేలా రూ.3 వేల నుంచి రూ.4 వేలకు లాటరీ పలికేలా చేస్తుంటారు. అలా పూర్తిగా బానిస చేసి వీధినపడేస్తున్నారు.

ఆరు బృందాలతో సోదాలు..: ఎస్పీ రాధిక ఆధ్వర్యంలో డీఎస్పీ మహేంద్ర మత్తే సారథ్యంలో ఆరు బృందాలు లాటరీ టిక్కెట్లు అమ్మే దుకాణాలపై గురువారం రాత్రి దాడులు జరిపాయి. రెండోపట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఈశ్వర ప్రసాద్‌ తెలిపారు.వన్‌టౌన్‌ స్టేషన్‌ పరిధిలో మరో తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్‌కుమార్‌ తెలిపారు.

మాయలోపడిపోతూ..: లాటరీ టిక్కెట్లను ప్రతిరోజు కూలీలు, బంగారు దుకాణాల వర్తకులు, మెకానిక్‌లు 5 నుంచి 10 టిక్కెట్లను కొనుగోలు చేస్తుంటారు. ఒక్కో వ్యక్తి సమయాలను చూసుకుని కొంటుంటారు. వీటి డ్రాలు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండున్నర, రెండు, నాలుగు, ఆరు గంటలకు తీస్తుంటారు.

ఇదీ చదవండి: తెలంగాణ పబ్ కేసులో ముమ్మర దర్యాప్తు.. నిందితులపై తొలిరోజు ప్రశ్నల వర్షం!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.