తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. ప్రభుత్వం, పోలీసులు ఎంత ప్రయత్నించినా.. ఈ దందా ఆగట్లేదు. ఎక్కడికక్కడే రవాణా అడ్డుకుంటున్నా ఏదో మూల గంజాయి రవాణా జరుగుతూనే ఉంది. తాజాగా తెలంగాణ సంగారెడ్డి జిల్లాలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు.
సంగారెడ్డిలో 10 క్వింటాళ్ల గంజాయిని (Heavy cannabis seized) టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ఏపీలోని విశాఖ నుంచి వస్తున్న లారీలో గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తుక్కు కింద గంజాయి మూటలు పెట్టి లారీలో అక్రమంగా రవాణా చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: AP HIGH COURT ON DRUGS CASE: 'మాదకద్రవ్యాల కేసుల్లో.. పెద్ద తలకాయలను పట్టుకోరా?'