ETV Bharat / crime

TRS dharna: తెరాస ధర్నా ఏర్పాట్లలో అపశృతి.. విద్యుదాఘాతంతో యువకుడు మృతి - one died in trs dharna arrangements

తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలో విషాదం నెలకొంది. నేడు తెరాస ఆధ్వర్యంలో ధర్నా(TRS dharna) సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లలో ఓ యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఘటనలో మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.

current shock
current shock
author img

By

Published : Nov 12, 2021, 9:58 AM IST

తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడలో విషాదం(electric shock) చోటుచేసుకుంది. నేడు తెరాస ఆధ్వర్యంలో ధర్నా(TRS dharna) సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లలో ఓ యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఘటనలో మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.

తెరాస ధర్నా(TRS dharna) సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా ప్రమాదవశాత్తు(electric shock) విద్యుదాఘాతం సంభవించింది. ఘటనలో యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు ఆందోళన చేపట్టారు.

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం అవలంభిస్తున్న వైఖరికి నిరసనగా.. గులాబీ పార్టీ ఈ రోజు ధర్నా(TRS dharna) నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో తెరాస ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ దిశానిర్దేశం చేశారు.

ఇదీ చదవండి:

ఒకే ఇంట్లో ఇద్దరు మృతి..మరో ఇద్దరికి అస్వస్థత.. కారణమేంటి..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.