ETV Bharat / crime

రాష్ట్రంలో ఒక్కరోజే మూడు హత్యలు - ఏపీలో హత్యలు తాజా

రాష్ట్రంలో పలు జిల్లాల్లో హత్యలు కలకలం రేపుతున్నాయి. ఒకరిపై ఒకరు దాడికి తెగబడుతున్నారు. విచక్షణారహితంగా హతమారుస్తున్నారు. ఒకే రోజు రాష్ట్రంలో మూడు హత్యలు జరిగాయి.

Murders in Andhra Pradesh
Murders in Andhra Pradesh
author img

By

Published : Mar 22, 2021, 10:22 AM IST

Updated : Mar 22, 2021, 4:21 PM IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మహిళ విషయంలో ఇద్దరు యువకుల మధ్య వివాదం నెలకొంది. ముప్పిడి పవనకుమార్ అనే యువకుడిని మరో యువకుడిని.. హతమార్చాడు. ఈ కేసులో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అనంతపురం జిల్లా హిందూపురం మండలం బసవన్నపల్లిలో యువకుడు హత్యకు గురయ్యాడు. బసవన్నపల్లిలో యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. పోలీసులు విచారణ చేపట్టారు.

కర్నూలు జిల్లా గూడూరు మండలం మునగాలలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. దస్తగిరి(50) అనే వ్యక్తిని దుండగులు చంపేశారు.

వివాహిత ఆత్మహత్య..

గుంటూరు జిల్లా తెనాలి మండలం కంచర్లపాలెంలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పూర్ణకంటి సాహితి(18) మహిళ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నాలుగు నెలల క్రితమే సాహితికి వివాహం జరిగింది. అయితే ఆమె భర్తే హత్య చేశాడని మృతురాలి బంధువుల ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి: దేశంలో కరోనా పంజా- కొత్తగా 46,951 కేసులు

Last Updated : Mar 22, 2021, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.