ETV Bharat / crime

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న టిప్పర్, ముగ్గురు యువకులు మృతి - నల్గొండలో ప్రమాదం

తెలంగాణ నల్గొండ జిల్లా అనుముల మండలం చింతగూడెం స్టేజి సమీపంలో లో ద్విచక్రవాహనాన్ని టిప్పర్​.. ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులంతా నల్గొండలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం

nalgonda accident
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న టిప్పర్, ముగ్గురు యువకులు మృతి
author img

By

Published : Apr 2, 2021, 3:31 PM IST

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న టిప్పర్, ముగ్గురు యువకులు మృతి

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనుముల మండలం చింతగూడెం స్టేజి సమీపంలో ఎదురుగా వస్తున్న టిప్పర్‌ ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులంతా నల్గొండలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు తెలుస్తోంది.

ముగ్గురు యువకులు బైక్​పై నల్గొండ వైపు వెళ్తుండగా.. నల్గొండ నుంచి వస్తున్న టిప్పర్​ చింతగూడెం స్టేజీ సమీపంలో ఢీకొంది. ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ముగ్గురు యువకులు ఘటనాస్థలిలోనే మృతి చెందారు.

మృతుల వివరాలు:

శ్రీకాంత్ (17) కొత్తలాపురం గ్రామం, పెద్దవూర మండలం, మహేష్ (17) అనుముల, శివ (18) పెద్దవూర మండలం చింతపల్లి. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: తెలంగాణ: గోదావరిలో ఏడుగురు గల్లంతు.. ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.