తెలంగాణలోని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తండాలో విషాదం చోటుచేసుకుంది. మాలావత్ ముజ్జుబాయ్ అనే మహిళ తన చిన్న కుమారుడు అరవింద్‌తో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయిన తల్లీకుమారులు.. ఊరిలోని వ్యవసాయ బావిలో శవాలై తేలారు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే బలవన్మరణానికి కారణమని భావిస్తున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉండగా.. భర్త పదేళ్ల క్రితమే చనిపోయాడు. పెద్ద కుమారుడికి ఇటీవలే వివాహం జరిగినట్లు సమాచారం.
ఇదీ చూడండి: 'ఫిర్యాదులను ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోంది'