kalluru suicide case: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరులో దారుణం చోటు చేసుకుంది. అభంశుభం తెలియని మూడు నెలల పసికందును చంపిన తల్లి.. ఆత్మహత్య చేసుకుంది. కల్లూరు గ్రామానికి చెందిన పుష్ప (24).. తన 3 నెలల కూతురు మోక్షితను చంపి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో కల్లూరులో విషాద చాయలు నెలకొన్నాయి. ఆత్మహత్యకు కుటుంబకలహాలే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఆత్మహత్యకు కుటుంబకలహాలే కారణమా.. లేక భర్త హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: Step father: మానవత్వం మరిచి... కూతురిపై మృగంలా ప్రవర్తించి