CI Nageswara Rao: హైదరాబాద్లోని మారేడ్‌పల్లి ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ.. అత్యాచారం ఆరోపణలతో సస్పెండైన నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు, సాంకేతిక ఆధారాలను సరిపోల్చిన వనస్థలిపురం పోలీసులు ఆయన్ను ఆదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పూర్తి విచారణ చేసిన తర్వాత రేపు అరెస్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. ఎల్బీనగర్ ఎస్‌వోటీ కార్యాలయంలో నాగేశ్వరరావును పోలీసులు విచారిస్తున్నారు. ఈ నెల 6న బాధితురాలి భర్త కర్రతో దాడి చేయడంతో నాగేశ్వరరావు భుజానికి గాయమైందని తెలిపారు. చికిత్స అనంతరం నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నామని ఎస్‌వోటీ పోలీసులు వెల్లడించారు.
అసలేం జరిగిందంటే: తన భర్తపై దాడి చేసి.. తనను అపహరించి ఇన్‌స్పెక్టర్ అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ హైదరాబాద్ వనస్థలిపురంలో ఫిర్యాదు చేసింది. స్పందించిన వనస్థలిపురం పోలీసులు ఇన్‌స్పెక్టర్‌పై కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.. అత్యాచారం, ఆయుధ చట్టం కింద నాగేశ్వర్‌రావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవీ చదవండి