Man Murder: అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలంలోని వెంకటాంపల్లిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బుక్కరాయసముద్రం నీలారెడ్డిపల్లికి చెందిన నరేంద్ర (35) ప్రస్తుతం పామిడి మండలం కొనేపల్లిలో నివాసం ఉంటున్నాడు. మొదటి భార్యతో మనస్పర్థలు ఏర్పడి ఆమెకు దూరంగా ఉంటూ.. వెంకటాంపల్లిలో కుళ్లాయిస్వామి వద్ద ట్రాక్టరు డ్రైవర్గా పనిలో చేరాడు. రెండేళ్ల కిందట ఆయన చెల్లెలు కుళ్లాయమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంతో వారి కుటుంబాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి.
కొన్ని రోజుల తర్వాత నరేంద్ర సొంతంగా ట్రాక్టర్ కొన్నాడు. అయితే సోమవారం రాత్రి అతనికి చెందిన ట్రాక్టరు వెంకటాంపల్లికి ఇసుక లోడుతో వెళ్లింది. దాని జాకీ పని చేయడం లేదని డ్రైవరు ఫోన్ చేయడంతో ద్విచక్ర వాహనంపై అక్కడకు వచ్చిన నరేంద్రను కుళ్లాయిస్వామి, అతని తమ్ముడు కొడవళ్లతో నరికి చంపి.. అక్కడి నుండి పరారయ్యారని సీఐ శేఖర్, ఎస్సై రాఘవేంద్రప్ప తెలిపారు. మృతుడి తండ్రి పోలీస్సేష్టన్కు వచ్చి ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:
మద్య నిషేధంపై చర్చంటే ప్రభుత్వానికి భయం: తెదేపా ఎమ్మెల్సీలు